జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( Pawan Kalyan )తెలంగాణలో కూడా తన పార్టీని బరిలో దించబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.వచ్చే ఎన్నికల్లో 32 స్థానాల్లో జనసేన అభ్యర్థులు బరిలో నిలువబోతున్నాట్లు ఆల్రెడీ చెప్పేశారు.
అయితే తెలంగాణ విషయంలో పవన్ ఎలా ముందుకు సాగబోతున్నారనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం.పార్టీ పెట్టినది మొదలుకొని కేవలం ఏపీపైనే ఫోకస్ చేస్తూ వచ్చిన పవన్.
ఈసారి మాత్రం తెలంగాణ విషయంలో తగ్గేదేలేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

గతంలో జిహెచ్‌ఎంసి ఎన్నికల బరిలో నిలిచేందుకు జనసేన పార్టీ ప్రయత్నించినప్పటికి బీజేపీతో ఉన్న పొత్తు కారణంగా విత్ డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, ఈసారి మాత్రం తెలంగాణలో పోటీ పక్కా అని పవన్ గంటాపథంగా చెబుతూ వస్తున్నారు.అయితే ప్రస్తుతం ఏపీలో బీజేపీతోను టీడీపీతోను పొత్తు కొనసాగిస్తున్నారు పవన్.( Pawan Kalyan ) కానీ తెలంగాణలో పొత్తులపై మాత్రం నో కామెంట్స్ అంటున్నారు.ఇప్పుడే చెప్పలేమంటూ దాటవేస్తున్నారు.దీంతో ఏపీలో అనుసరించిన స్ట్రాటజీని తెలంగాణలో కూడా పవన్ అమలు చేయబోతున్నారా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.ఏపీలో టీడీపీ జనసేన మద్య పొత్తు ఉంటుందని ఎప్పటి నుంచో గుసగుసలు వినిపించిన పొత్తు విషయంలో ఎప్పుడు స్పష్టతనివ్వలేదు పవన్.కానీ చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళగానే పొత్తు ప్రకటించారు.

తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అంచనా వేస్తూ సరైన టైమ్ లో ఏదో ఒక పార్టీతో జట్టు కట్టేందుకు పవన్ ( Pawan Kalyan )సిద్దపడతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.అయితే తెలంగాణలో జనసేనతో పొత్తు ఉండబోదని బీజేపీ ఒనరిగానే బరిలోకి దిగుతుందని ఇప్పటికే ఆ పార్టీలోని బండి సంజయ్( Bandi Sanjay Kumar ) వంటి కీలక నేతలు పలుమార్లు చెప్పుకొచ్చారు.రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఊహించడం కష్టం కాబట్టి.అనూహ్యంగా బీజేపీ జనసేన( BJP Janasena ) తెలంగాణలో కూడా జట్టు కట్టిన ఆశ్చర్యం లేదనేది కొందరి అభిప్రాయం.
ఏది ఏమైనా పరిస్థితులకు తగ్గట్లు తన స్ట్రాటజీలకు పదును పెడుతూ రాజకీయాలను హిటెక్కిస్తున్నారు పవన్ కల్యాణ్.