Kushi Movie Director SJ Surya : పవన్ తో ఖుషి డైరెక్టర్.. మెమొరబుల్ పిక్ షేర్.. నెట్టింట వైరల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమాలు చాలానే ఉన్నాయి.అందులో ముందు చెప్పుకోవాల్సిన సినిమా ఖుషి.

 Pawan Kalyan's Kushi Movie Director Sj Surya Shares Viral Pic, Hari Hara Veera M-TeluguStop.com

పవన్ కళ్యాణ్ హీరోగా భూమిక హీరోయిన్ గా శ్రీ సూర్య బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది.పవన్, భూమిక కెమిస్ట్రీ ఈ సినిమాను టాప్ లో నిలబెట్టింది.ఇక అంత సెన్సేషనల్ సినిమాను ఎస్ జే సూర్య దర్శకత్వంలో తెరకెక్కింది.2001లో రిలీజ్ అయినా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.భూమిక అందాలకు అంతా ఫిదా అయ్యారు.అలాగే పవన్ కళ్యాణ్ యాక్టింగ్, స్టైల్, యాక్షన్ అన్ని కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యేలా చేసాయి.మరి ముఖ్యంగా మణిశర్మ సాంగ్స్ ఇప్పటికి సూపర్ హిట్టే.ఆ సాంగ్స్ కూడా సినిమా హిట్ అవ్వడానికి ఒక కారణం అనే చెప్పాలి.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా డైరెక్టర్ ఎస్ జే సూర్య ఖుషి సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ తో దిగిన ఒక మెమరబుల్ ఫోటోను షేర్ చేసారు.సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటో కాసేపటికే వైరల్ అయ్యింది.

పవన్ కుర్చీలో కూర్చుని ఉండగా.సూర్య ఆయన మెడ చుట్టూ చేతులు వేసి నిలబడి ఉన్నాడు.

పవన్ ఎంతో స్టైలిష్ గా కళ్లద్దాలు పెట్టుకుని ఉన్నాడు.ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

Telugu Krish, Sjsuryapawan, Harihara, Harish Shankar, Kushi-Movie

ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే.ప్రెజెంట్ పవన్ చేతిలో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ ప్రకటించాడు.అలాగే తమిళంలో సముద్రఖని తెరకెక్కించిన ‘వినోదయ సీతమ్‘ సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేయబోతున్నాడు.

ఇన్ని చేతిలో ఉన్న పవన్ మాత్రం షూటింగ్ లలో పాల్గొనకుండా రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు.అందుకే అవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు రిలీజ్ అవుతాయో కూడా క్లారిటీ లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube