ఆ ఎమ్మెల్యే కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పవర్ స్టార్..!

తాజాగా ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు కోపం విరుచుకుపడింది.ఎన్నడూ లేనివిధంగా.

 Pawan Kalayan, Janasena Party, Bhimavaram Mla, Ysrcp Party, Warning, Janasena Le-TeluguStop.com

ఒక వైసీపీ ఎమ్మెల్యేను ఉద్దేశించి వ్యక్తిగతంగా తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పాటు సంచలన ఆరోపణలు పవన్ కళ్యాణ్ చేశారు.ఇటీవల కాలంలో జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని సర్పంచ్ పై భీమవరం ఎమ్మెల్యే దాడులకు పాల్పడ్డరు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా. భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వీరవాసం మండలం మత్స్యపురిలో సర్పంచిగా ఎన్నికైన మహిళలకు జనసేన పార్టీ అధికారులు మద్దతు ఇవ్వడంతో.అందుకు కోపంతో స్థానిక ఎమ్మెల్యే సర్పంచ్ ఇంటిపై దాడులు నిర్వహించడమే కాకుండా కార్లు, వాహనాలను ధ్వంసం చేసినట్లు సమాచారం.ఘటనపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్పందించారు.వాటికి చెందిన భీమవరం ఎమ్మెల్యే ఒక ఆకు రౌడీ అని, సహకార బ్యాంకును దోచేసిన వ్యక్తిగా అతనికి పేరు ఉంది అని పేర్కొన్నాడు.“ఎమ్మెల్యేకు ఎలా సమాధానం చెప్పాలో మాకు బాగా తెలుసు” అంటూ పవన్ కళ్యాణ్ స్పందించారు.భీమవరం ఎమ్మెల్యేకు బెదిరింపులకు గురి చేయటం, వ్యక్తిగతంగా నన్ను దూషించడం సభ్యసమాజం తలదించుకునేలా, అతనికి అలవాటుగా మారిపోయిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.సర్పంచ్ గా ఎంపికైన మహిళపై దాడులకు పాల్పడడం, ఇతర వార్డు సభ్యులు ఇళ్లపై దాడులు చేస్తున్నారని ఆరోపణలు చేశారు.
ఈ సందర్భంగా ఏపీ డీజీపీ ఒక విషయం పై ఫుల్ క్లారిటీ ఇస్తూ… భీమవరంలో శాంతి భద్రతలు అదుపు తప్పయని మళ్లీ ఆ పరిస్థితి ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇలానే దాడులకు పాల్పడితే తర్వాత ఏమి జరిగినా మాకు సంబంధం లేదు అని స్పష్టంగా తెలిపాడు పవన్.

భీమవరం ఎమ్మెల్యేకి ఇలా నేరుగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube