Pawan Kalyan Vanga Geetha : పిఠాపురం వైసీపీ అభ్యర్థి పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!!

2024 ఎన్నికలలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పిఠాపురం నియోజకవర్గం( Pithapuram Constituency ) నుండి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.అదే నియోజకవర్గ నుండి వైసీపీ తరపున వంగా గీత( Vanga Geetha ) పోటీ చేస్తున్నారు.

 Pawan Kalyan Sensational Comments On Pithapuram Ycp Candidate-TeluguStop.com

ఇదిలా ఉంటే మంగళవారం పిఠాపురం నియోజకవర్గంలో పలువురు జనసేన పార్టీలో( Janasena Party ) జాయిన్ అవ్వటానికి సిద్ధమయ్యారు.ఈ క్రమంలో సదరు నాయకులను పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వైసీపీ పార్టీ అభ్యర్థి వంగా గీతపై పవన్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.పిఠాపురంలో తనని ఓడించేందుకు ప్రత్యర్థులు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు.

అని ఆరోపించారు.

వైసీపీ( YCP ) నుంచి పోటీ చేస్తున్న వంగా గీత జనసేన పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచారని గుర్తు చేశారు.తనను చాలామంది పిఠాపురం నుండి పోటీ చేయాలని ఒత్తిడి తేవటంతోనే బరిలోకి దిగుతున్నట్లు పేర్కొన్నారు.

నన్ను అసెంబ్లీకి పంపిస్తామని హామీ ఇచ్చారు.ఆ ధీమాతోనే చెబుతున్నా .లక్ష మెజారిటీతో గెలుస్తా.ప్రజాస్వామ్యంలో నాలాంటి వ్యక్తి గెలిస్తే రాష్ట్రానికి మంచిది కానీ నాకు కాదు.

అలాంటిది నన్ను ఓడించడానికి ఓటుకి పదివేలు కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube