పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి( Pawan Kalyan ) అత్యధిక వసూళ్లు తెచ్చే ప్రాంతాలలో ఒకటి తెలంగాణ ప్రాంతం. ఈ ప్రాంతం లో ఆయన తొలిప్రేమ సినిమా నుండి క్రేజ్ తెచ్చుకున్నాడు.
ఖుషి సినిమాతో తెలంగాణ యూత్ కి ఐకాన్ లాగ మారిపోయాడు.యూత్ అంటే అప్పట్లో కచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యుంటాడు అని అనుకునేవారు అప్పట్లో.
ఆ స్థాయిలో ఆయన క్రేజ్ ని దక్కించుకున్నాడు.ఖుషి( Khusi ) తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన ప్రతీ సినిమా టాక్ తో సంబంధం లేకుండా తెలంగాణ ప్రాంతం లో( Telangana ) ఓపెనింగ్స్ ని దక్కించుకునేవి.
అందుకే పవన్ కళ్యాణ్ ని నైజాం కింగ్ అని అంటూ ఉంటారు.ఇప్పటికీ కూడా ఆయనే నైజాం కింగ్.
తెలంగాణ ప్రాంతం లో ఇప్పుడు రీమేక్ సినిమాలను అసలు చూడడం లేదు, కానీ అదే రీమేక్ పవన్ కళ్యాణ్ చేస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దలయ్యే రేంజ్ వసూళ్లు వస్తున్నాయి.
రాజకీయాల్లోకి వెళ్లి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ మూడు సినిమాలు చేసాడు.ఈ మూడు చిత్రాలు కూడా ఓటీటీ లో అందుబాటులో ఉండే సినిమాలే.వాటినే రీమేక్ చేసి వదిలాడు.
అవే వకీల్ సాబ్, భీమ్లా నాయక్ మరియు బ్రో.ఈ చిత్రాలకు ఈ ప్రాంతం లో భారీ వసూళ్లు వచ్చాయి.
వకీల్ సాబ్( Vakeel Saab ) చిత్రం కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తున్న రోజుల్లో వచ్చింది.జనాలు గడప దాటి బయటకి రావడానికి వణికిపోతున్న రోజులవి, అలాంటి సమయం లో కూడా ఈ సినిమా తెలంగాణ ప్రాంతం నుండి 28 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఇక ఆ తర్వాత వచ్చిన ‘భీమ్లా నాయక్’( Bheemla Nayak ) చిత్రం మొదటి రోజు , వీకెండ్ మరియు మొదటి వారం లో ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పింది.ఫుల్ రన్ లో ఈ చిత్రం 35 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.
ఇక రీసెంట్ గా విడుదలైన ‘బ్రో ది అవతార్’( Bro The Avatar ) చిత్రానికి మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది.ఈ సినిమాకి కూడా ఇక్కడ 22 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.ఒక ఫ్లాప్ సినిమాకి ఇంత వసూళ్లు రావడం, అది కూడా ఈ రోజుల్లో అంటే మామూలు విషయం కాదు.ఆలా పవన్ కళ్యాణ్ మూడు చిత్రాలకు కలిపి నైజాం ప్రాంతం లో 80 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.
రీమేక్ సినిమాలకే ఈ స్థాయి వసూళ్లు వస్తే, ఇంకా రాబొయ్యే ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ’ మరియు ‘హరి హర వీరమల్లు’ వంటి సినిమాలకు ఏ రేంజ్ వసూళ్లు వస్తాయో చూడాలి.