పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లో రీఎంట్రీ ఇస్తూ వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ చిత్రాన్ని తెలుగులో వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేస్తుండగా, ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చూసినా, ప్రస్తుత పరిస్థితుల కారణంగా అది సాధ్యం కాలేదు.కాగా పవన్ తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడు.
ఇప్పటికే స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తన 27వ చిత్రాన్ని లైన్‌లో పెట్టాడు.ఈ సినిమాకు విరూపాక్ష అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
కాగా ఈ సినిమా తరువాత పవన్ తన 28వ చిత్రాన్ని గబ్బర్‌సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే హరీష్ చెప్పిన కథకు పవన్ ఓకే చెప్పిన సంగతి తెలిసిందే.
అయితే పవన్ 29వ చిత్రాన్ని కూడా లైన్‌లో పెట్టేందుకు రెడీ అయ్యాడు.
ఈ మేరకు ఇద్దరు డైరెక్టర్లు చెప్పిన కథలను విన్న పవన్, అందులో ఒకరికి ఓకే చేశాడట.
గోపాల గోపాల, కాటమరాయుడు వంటి సినిమాలు తెరకెక్కించిన డాలీతో పాటు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను తెరకెక్కించిన బాబీ కథలను విన్న పవన్, డాలీకి ఓకే చేశాడట.దీంతో ఈ సినిమా స్క్రిప్టును పూర్తి చేసే పనిలో పడ్డాడట డాలీ.
పవన్ ఫ్యాన్స్‌ను మరోసారి మెప్పించేందుకు డాలీ ఈసారి ఎలాంటి కథతో వస్తాడో చూడాలి.