పవన్ కళ్యాణ్ హీరోగా రానా కీలక పాత్రలో సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం భీమ్లా నాయక్.ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
దాదాపుగా 200 కోట్ల వసూళ్లను ఈ సినిమా మొదటి రెండు వారాల్లో నే రాబట్టింది.ఇక ఈ సినిమా థియేటర్ల నుండి పూర్తిగా వెళ్ళిపోనట్లే.
నేటి నుండి రాధేశ్యాం ప్రేక్షకుల ముందుకు రావడంతో భీమ్లా నాయక్ సినిమా ని జనాలు పట్టించుకునే పరిస్థితి లేదు.అక్కడ అక్కడ ఒకటి రెండు థియేటర్లలో కనిపించినా వచ్చే వారంతో థియేటర్ ల నుండి కూడా కనిపించకుండా పోయే అవకాశం ఉంది.
ఈ సమయంలో పవన్ అభిమానులు మరియు ప్రేక్షకులు భీమ్లా నాయక్ సినిమా ని ఓటీటీ ద్వారా విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.ఆ మధ్య అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా థియేటర్ రిలీజ్ అయిన మూడు వారాల తర్వాత అమెజాన్ లో స్ట్రీమింగ్ చేయడం జరిగింది.
![Telugu Bheemla Nayak, Ott, Pawan Fans, Pawan Kalyan, Rana-Movie Telugu Bheemla Nayak, Ott, Pawan Fans, Pawan Kalyan, Rana-Movie](https://telugustop.com/wp-content/uploads/2022/03/ott-movie-pawan-fans-pawan-kalyan-rana.jpg )
ఆ సినిమా రెండు వారాల్లోనే పూర్తి వసూళ్లు సాధించింది కనుక మూడవ వారంలో విడుదల చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ నిర్మాతలు ఆ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయడం జరిగింది.ఇప్పుడు అదే తరహాలో భీమ్లా నాయక్ సినిమాను కూడా తెలుగు ఓటీటీ లో విడుదల చేయాలంటూ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా థియేటర్ స్క్రీనింగ్ చేసిన వారు ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని కోరుకుంటున్నారు.థియేటర్లలో చూడని ఫ్యామిలీ ఆడియన్స్ ఇప్పుడు ఓటీటీ ద్వారా చూడాలని వారు ఆశిస్తున్నారు.
ఇంకా థియేటర్ కు వెళ్లి ఈ సినిమాలు చూస్తారు అనుకుంటే పొరపాటు అవుతుంది.అయినా థియేటర్లలో ఎక్కడా కూడా ఈ సినిమా కనిపించడం లేదు.కనుక ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసినా నష్టమేమీ లేదు.ఈ విషయమై వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలని చిత్ర యూనిట్ సభ్యులకు పవన్ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మరి సితార ఎంటర్టైన్మెంట్ వారు ఈ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు ఈ సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసేందుకు హక్కులను కొనుగోలు చేశారు.
నాలుగవ వారం తర్వాత ఈ సినిమా ను వారు స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఇటీవలే ప్రకటించారు.