దిల్ రాజు కనిపిస్తే కొట్టేంత కోపంతో ఉన్న పవన్ అభిమానులు.. కారణం ఇదే!

ఒమిక్రాన్‌ తో థర్డ్‌ వేవ్‌ మొదలయ్యింది.ఉత్తర భారతంలో ప్రభావం మొదలు అవ్వడంతో థియేటర్లు మూత పడ్డాయి.

 Pawak Kalyan Fans Full Angry On Producer Dil Raju Details, Producer Dil Raju, Bh-TeluguStop.com

కొన్ని థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి.ముందు ముందు పూర్తిగా మూతపడే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

ఈ సమయంలో పవన్‌ కళ్యాణ్ అభిమానులు దిల్‌ రాజుపై కారాలు మిరియాలు నూరుతున్నారు.ఆయన వల్లే తమ భీమ్లా నాయక్ మిస్ అయ్యాం.

ఎప్పటికి వస్తుందో కూడా క్లారిటీ దక్కడం లేదు అంటూ పవన్ అభిమానులు అసంతృప్తి తో ఉన్నారు.అసలు విషయం ఏంటీ అంటే పవన్ కళ్యాణ్‌ భీమ్లా నాయక్ సినిమా ను సంక్రాంతికి విడుదల చేసి తీరుతాను అంటూ నిర్మాత పట్టుబట్టి కూర్చున్నాడు.

ఎవరు అడిగినా కూడా సంక్రాంతికే మా సినిమా వస్తుందని ఆయన అన్నాడు.కాని ఈ సమయంలో దిల్‌ రాజు రంగంలోకి దిగి నేరుగా పవన్‌ కళ్యాణ్‌ తో మాట్లాడి ఆర్‌ ఆర్‌ ఆర్‌ మరియు రాధే శ్యామ్‌ వంటి పెద్ద సినిమా లు సంక్రాంతికి ఉన్నాయి కనుక మా సినిమా ను వాయిదా వేసుకుంటాం అనేట్లుగా ఒప్పించాడు.

పవన్‌ స్వయంగా భీమ్లా నాయక్ సినిమా నిర్మాత తో మాట్లాడి వాయిదా వేయించాడు.ఫిబ్రవరి చివరి వారంలో భీమ్లా నాయక్ వస్తుందని అంటున్నారు.

సరే ఫిబ్రవరి చివరి వారంలో భీమ్లా నాయక్‌ విడుదల అయితే పర్వాలేదు.కాని థర్డ్‌ వేవ్‌ భీకరంగా ఉంటుంది.

కనీసం మార్చి చివరి వరకు పరిస్థితులు కఠినంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Telugu Bheemla Nayak, Dil Raju, Omicron, Pawan Kalyan, Rrr, Tollywood-Movie

అదే కనుక జరిగితే భీమ్లా నాయక్  ఫిబ్రవరి లో కాదు కదా కనీసం మార్చి ఏప్రిల్‌ లో కూడా విడుదల కాదు.అంటే భీమ్లా నాయక్ చూడాలంటే మరో నాలుగు అయిదు నెలలు వెయిట్‌ చేయాల్సి రావచ్చు అంటున్నారు.అందుకే భీమ్లా నాయక్‌ ను వాయిదా వేయించిన దిల్‌ రాజు కనిపిస్తే కొట్టేంత కోపంతో పవన్ అభిమానులు ఉన్నారంటూ నెటింట ప్రచారం జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube