ఏపీ విద్యా వ్యవస్థలో సంస్కరణల పథం కొనసాగుతోంది.నాలుగేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో విద్యావ్యవస్థలో ఎన్నో రకాల సంస్కరణలు, సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం తీసుకువచ్చింది.
జగనన్న విద్యాకానుక కిట్లు పేరిట విద్యార్థులకు పుస్తకాలు, భోజనం, స్కూల్ బ్యాగులు, షూ, యూనిఫారాలు ఇలా ప్రతిదీ అందిస్తుంది.అంతేకాదు వరల్డ్ క్లాస్ విద్యాబోధనలో భాగంగా ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ తో ట్యాబ్ లను సైతం అందించి డిజిటల్ తరగతులకు నాంది పలికింది జగన్ సర్కార్.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన మెరుగుపరిచి నాణ్యమైన విద్య కోసం సీఎం వైఎస్ జగన్ సంకల్పానికి ప్రజలందరూ జేజేలు పలుకుతున్నారు.ఈ క్రమంలోనే విద్యా వికాసానికి, విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ సారథ్యంలోని ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధ, బాధ్యత రాష్ట్రం, దేశంలోనే కాకుండా ఖండాంతరాలకు వ్యాపిస్తూ మేధావులు, నిపుణులు, విద్యావేత్తలకు సైతం అర్థం అవుతుంది.
కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షానికి మాత్రం ఇదంతా అవగతం కాకపోవడంతో ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకుందని తెలుస్తోంది.
ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఐరాస సదస్సులో పాల్గొని తమ మేథోపటిమను విశ్వవ్యాప్తం చేశారు.
ఒక మారుమూల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మండల కేంద్రానికి వెళ్లి కొత్తవాళ్లతో మాట్లాడడమే గగనం.వారిలోని ఆత్మన్యూనతాభావం వారి నోటిని కట్టేస్తుంది.
కానీ మన విద్యార్థులు అంతర్జాతీయ వేదికల మీద, ముఖ్యమంత్రి ముందు సైతం అనర్గళంగా ఆంగ్లంలో ప్రసంగిస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.దీనంతటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న శ్రద్ధే ప్రధాన కారణమని పలువురు చెబుతుండటం విశేషం.
అమ్మఒడి, గోరుముద్ద, విద్యాకానుక ఇలా ప్రతి పథకాన్ని సమర్థంగా అందిస్తూ ప్రభుత్వ పాఠశాలలను నందనవనాల మాదిరి తీర్చిదిద్దిన ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.జగన్ పాలనకు వివిధ రాష్ట్రాలు ముచ్చటపడ్డాయి.
అంతేకాదు తామూ ఈ విధంగానే విద్యార్థుల కోసం చేస్తాం అంటూ మన రాష్ట్రానికి వచ్చి పాఠశాలలను చూసి వెళ్లాయి.ఇక ఇప్పుడు ఏకంగా నోబెల్ అవార్డ్ గ్రహీత, చికాగో యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ మైకేల్ రాబర్డ్ క్రేమెర్ సైతం ఏపీలోని విద్యాశాఖ పని తీరు చూసి అబ్బురపడ్డారు.
డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ డైరెక్టర్ కూడా అయిన క్రేమెర్ ఏపీలోని వివిధ పాఠశాలలను సందర్శించేందుకు వచ్చారు .పిల్లలకు అందిస్తున్న సౌకర్యాలు, ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధను చూసి ముచ్చటపడ్డారు.విద్యార్థుల మనోవికాసానికీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని, ఇలాంటి సంస్కరణలే విద్యార్థులను సమున్నతంగా తీర్చిదిద్దుతాయని కొనియాడారు.ప్రభుత్వ స్కూళ్లలో తీసుకొచ్చిన మార్పులు, విద్యార్థులు సాధిస్తున్న ప్రగతి నిజంగా ఓ అద్భుతమైన మార్పు అని చెప్పడం విశేషం.