బొప్పాయి పంట( Papaya crop )ను కేవలం తెగుళ్ల బారిన పడకుండా సంరక్షించుకుంటే అధిక దిగుబడి( High yield ) పొందవచ్చు.బొప్పాయి పంటకు వెర్రి తెగులు, రింగ్ స్పాట్ తెగులు, ఆకుముడత తెగులు ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తాయి.
ఈ తెగులను తొలి దశలోనే సరైన యాజమాన్య పద్ధతులు పాటించి అరికట్టాలి.లేదంటే ఈ తెగులుకు సంబంధించిన వైరస్ కణాలు ( Virus particles )మొక్కలో ప్రవేశిస్తే మొక్కకు క్షీణించే వరకు దాని జీవకణాలలోనే ఉండి రకరకాలుగా పంటకు నష్టం కలిగిస్తాయి.
వెర్రి తెగులు బొప్పాయి పంటను ఆశిస్తే ఆకు సైజు తగ్గుతుంది.ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి.
ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు పెలుసుగా మారతాయి.మొక్కల పెరుగుదల సరిగా ఉండదు.
కాయలు కూడా గిడసబారి నాసిగా ఉంటాయి.
రింగ్ స్పాట్ తెగులు పంటను ఆశిస్తే మొక్కల ఆకులు, కాండం, పూత, పిందే, కాయ, పండ్లు పచ్చదనం కోల్పోయి పసుపుపచ్చగా మారుతాయి.మొక్క ఎదుగుదల పూర్తిగా తగ్గిపోతుంది. ఆకు ముడత తెగులు( Leaf blight pest ) పంటను ఆశిస్తే.
తెగులు సోకిన మొక్కల ఆకులు ముడుచుకొని బంతిలాగా మారుతాయి.ఆకుతోడిమా వంకర టింకరగా తిరుగుతుంది.
చెట్టు తల ఆకారం కూడా మారుతుంది.పూత సరిగా రాదు.
ఈ తెగులు పంటను ఆశించకుండా ఉండాలంటే.ఒకవేళ ఆశించిన తొలి దశలోనే అరికట్టడం కోసం సరైన యాజమాన్య పద్ధతులు ఏమిటో చూద్దాం.తెగులు నిరోధక నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకుని విత్తన శుద్ధి చేసుకోవాలి.తెగులు సోకిన మొక్కలను వెంటనే పంట నుండి పీకి నాశనం చేయాలి.కలపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి.0.3 గ్రా థైయోమిథాక్సిన్( Thiomethoxine ) ను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.లేదంటే 1.5 గ్రా ఎసిఫెట్ ను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.సరైన నీరు, పోషకాల యజమాన్యం ద్వారా కూడా ఈ వైరస్ తెగుళ్ళను అరికట్టవచ్చు.