సినిమా ఇండస్ట్రీలో స్టార్ట్ సెలబ్రిటీలుగా కొనసాగే వారందరికీ తప్పనిసరిగా మేనేజర్లు ఉంటారనే విషయం మనకు తెలిసిందే.ఇలా మేనేజర్లే సెలబ్రిటీలకు సినిమా అవకాశాలు తీసుకురావడమే కాకుండా వారికి సంబంధించిన అన్ని విషయాలను అలాగే ఫైనాన్షియల్ విషయాలను కూడా చూసుకుంటూ ఉంటారు.
ఇలా ప్రతి ఒక్క సెలబ్రిటీకి తమకంటూ ఒక మేనేజర్ తప్పనిసరిగా నియమించుకుంటూ ఉంటారు.అందరిలాగే బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ( Shah Rukh Khan )సైతం తన మేనేజర్ పైన ఎక్కువగా ఆధారపడి ఉంటారు.
కేవలం షారుఖ్ ఖాన్ మాత్రమే కాకుండా ఆయన భార్య గౌరీ ఖాన్ ( Gowri Khan ) సైతం వారి మేనేజర్ పూజ దద్లానీ( Pooja Dadlani ) పైన ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు.ఇక పూజ సైతం వారి సినిమా విషయాలు మాత్రమే కాకుండా వారి ఫ్యామిలీకి సంబంధించిన విషయాలతో పాటు వారి వృత్తిపరమైన విషయాలన్నింటినీ కూడా ఈమె స్వయంగా చూసుకుంటారు.ఈ విధంగా షారుఖ్ ఖాన్ ఫ్యామిలీ( Shah Rukh Family )తో పూజకు ఎంతో మంచి అనుబంధం ఉంది ఇక గౌరీకాన్ పూజ ఇద్దరూ కూడా చాలా మంచి స్నేహితులు సెలబ్రిటీలలకు ఇంటీరియర్ డిజైన్ చేసే గౌరీ ఖాన్ స్వయంగా పూజ ఇంటికి కూడా ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేశారు అంటే వారిద్దరి మధ్య ఎలాంటి సన్నిహిత్యం ఉందో అర్థం అవుతుంది.
2012 వ సంవత్సరంలో షారుక్ ఖాన్ కు మేనేజర్( Shah Rukh Khan Manager ) గా చేరినటువంటి ఈమె దగ్గర దశాబ్ద కాలంగా తన ఇంట్లో తనకు ఎంతో నమ్మకంగా పనిచేస్తూ ఉన్నారు.ఇలా అన్ని విషయాలలోనూ పూజా ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది అని చెప్పాలి అయితే ఈమె కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని షారూక్ అందజేస్తారని తెలుస్తోంది.ఈమె ఏడాదికి సుమారు రూ.7 కోట్ల నుండి 9 కోట్ల రూపాయల వరకు( ( Manager Pooja Dadlani Net Worth ) వార్షిక ఆదాయం సంపాదిస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.ఆమె షారుఖ్ ఖాన్ బ్రాండ్ ఎండార్స్మెంట్స్ తో పాటుగా ఇతర వ్యాపారాలను కూడా నిర్వహిస్తుందని తెలుస్తోంది.
ఏది ఏమైనా ఒక సెలబ్రిటీ మేనేజర్ ఇలా సంవత్సరానికి దాదాపు తొమ్మిది కోట్ల రూపాయల వరకు సంపాదిస్తుంది అంటే ఏ హీరోయిన్ కూడా ఈ స్థాయిలో సంపాదించలేదని చెప్పాలి.