బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా( Parineeti Chopra ) త్వరలోనే ఎంపీ రాఘవ చద్దాని పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే.రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్ వీరి వివాహానికి వేదిక కానుంది.
ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో ఈ ముద్దుగుమ్మ తరచూ పెళ్ళికి సంబంధించిన వార్తలతో సోషల్ మీడియాలో నిలుస్తున్న విషయం తెలిసిందే.తరచూ ఈ ముద్దుగుమ్మకు సంబంధించి ఏదో ఒక వార్తలో సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ ని తలచుకుంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది.
కాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్, పరిణీతి చోప్రా ఇద్దరు కలిసి 2013 లో శుద్ధ్ దేశీ రొమాన్స్( Shuddh Desi Romance ) చిత్రంలో నటించారు.ఈ సినిమా విడుదలై సెప్టెంబర్ 6 నాటికీ పదేళ్లు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా పరిణీతి చోప్రా ఆ రోజులను గుర్తు చేసుకుంది.
అవును నిజమే కాలం ఎగిరిపోతుంది.దశాబ్దం గడిచినా ఆ సినిమా జ్ఞాపకాలు ఇంకా కొత్తగానే ఉంటాయి.
అది నవ్వులతో నిండిన ఒక మధురమైన ప్రయాణం, అలాంటి దిగ్గజ నటులతో ఈ సినిమా చేయడం జీవితంలో గొప్ప అనుభవం.రిషి సార్ మిమ్మల్ని మిస్ అవుతున్నాం.
సుశాంత్ సింగ్( Sushant Singh Rajput ) నిన్ను చాలా ఎక్కువగా మిస్ అవుతున్నాను.మీరు నాకిష్టమైన నటుల్లో మీరు కూడా ఒకరు అని తెలిపింది పరిణీతి చోప్రా.
ఈ సందర్భంగా సినిమా పోస్టర్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆ పోస్ట్ పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.కాగా రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం అప్పట్లో విడుదల అయ్యింది పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే.మనీష్ శర్మ( Manish Sharma ) దర్శకత్వం వహించిన ఈ సినిమా 22 కోట్లతో రూపొంది దాదాపు 76 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
సుశాంత్, పరిణీతిలకు పెద్ద బ్రేక్ ఇచ్చింది.కాగా హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ 2020 జూన్ 14న ఆత్మహత్య చేసుకొని మరణించిన విషయం తెలిసిందే.