సోలో సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడు గా ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి పరశురాం.పూరి జగన్నాథ్ దగ్గర పనిచేసి తర్వాత డైరెక్టర్ గా టర్న్ తీసుకున్న పరశురాం కెరియర్ లో గీత గోవిందం సినిమా మైల్ స్టోన్ అని చెప్పాలి.
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఆ సినిమా వీళ్ళిద్దరికీ బ్లాక్ బస్టర్ అందించడంతోపాటు టాలీవుడ్ లో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి 100 కోట్లు కలెక్షన్ చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది.ఆ సినిమాతో స్టార్ దర్శకుడిగా మారి పోయినా పరశురామ్ కి వరుసగా అవకాశాలు వస్తాయని అందరూ భావించారు.
నిర్మాతలు కూడా అతనితో సినిమా కోసం సిద్ధమయ్యారు.
అయితే మళ్లీ మెగా కాంపౌండ్ లోనే అల్లు అర్జున్ తో లేదంటే సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తీయాలని ప్లాన్ చేసిన పరశురామ్ కి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.
దీంతో గీత గోవిందం సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని దర్శకుడు తాజాగా కొత్త సినిమా ఎనౌన్స్ చేశారు.అక్కినేని యువ హీరో నాగచైతన్య తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించారు.14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ మీద ఈ సినిమా తెరకెక్కబోతుంది.ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమాలో నటిస్తున్న నాగ చైతన్య దానిని కంప్లీట్ చేసిన వెంటనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నం లో అన్నట్లు తెలుస్తుంది.