దిశ చట్టం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు

హైదరాబాద్‌లో దిశ సంఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన విషయం తెల్సిందే.

దిశ సంఘటన తర్వాత ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు చేయకుండా కఠిన శిక్షలు విధించబోతున్నట్లుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

ఇందుకోసం దిశ చట్టంను ఏపీలో తీసుకు రావడం జరిగింది.ఈ చట్టం ద్వారా ఏపీలో అఘాయిత్యంకు పాల్పడ్డ వ్యక్తులకు 21 రోజుల్లోనే శిక్ష పడేలా చట్టంను తీసుకు వచ్చారు.

అయితే ఈ చట్టం పనికి రానిదని, దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు అంటూ అయేషా మీరా తండ్రి ఇక్బాల్‌ బాషా అన్నాడు.అయేషా మీరాను 2007 డిసెంబర్‌ లో అఘాయిత్యం చేసి హత్య చేసిన విషయం తెల్సిందే.

అప్పటి నుండి కూడా ఈ కేసు నానుతూనే ఉంది.ఈ కేసులో సత్యం బాబును దాదాపు 10 ఏళ్ల పాటు జైల్లో ఉంచారు.

Advertisement

ఆయన ఎట్టకేలకు నిర్ధోశి అంటూవెళ్లడి అవ్వడంతో ఆయన్ను విడుదల చేసి మళ్లీ కొత్తగా ఎంక్వౌరీ చేస్తున్నారు.ఇలాంటి చట్టాలు తీసుకు రావడం వల్ల అఘాయిత్యాలకు గురైన అమ్మాయిలకు న్యాయం జరుగుతుందని తాను భావించడం లేదు అంటూ ఈ సందర్బంగా ఇక్బాల్‌ అన్నాడు.

విచారణ అంత త్వరగా పూర్తి అవుతుందని తాము భావించడం లేదని అన్నాడు.అయేషా మీర కేసు ఇంకా ఎంత కాలం పడుతుందో తెలియదు అంటూ ఈ సందర్బంగా ఆయన అన్నాడు.

Advertisement

తాజా వార్తలు