భారత న్యాయ వ్యవస్థ పూర్తిగా స్వతంత్రమైనదని అన్నారు సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.మంగళవారం జర్మనీలోని డార్ట్‌మండ్ నగరం గుటెన్ మోర్గెన్‌లో ఇండో-జర్మన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ‘ప్రపంచీకరణ సమాజంలో ఆర్బిట్రేషన్-భారత అనుభవాలు’ అంశంపై జరిగిన సదస్సులో సీజేఐ పాల్గొని ప్రసంగించారు.
దేశంలోని అందరినీ సమానంగా చూస్తూ , న్యాయాన్ని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఏదైనా విదేశీ వ్యవస్థ, సంస్థ, వ్యక్తులు ఫిర్యాదుల పరిష్కారం కోసం భారత్‌లోని ఏదైనా చట్టపరమైన ఫోరమ్‌ను సంప్రదించడానికి భారత రాజ్యాంగం వీలు కల్పిస్తుందని జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు.
భారత్‌లోని న్యాయస్థానాలు.వ్యక్తి, జాతీయత అనే వివక్ష చూపవని, వాటికి అందరూ సమానమేనని ఆయన అన్నారు.
అయితే ఒక వ్యాపార సంస్థ.చట్టపరమైన రక్షణను అనుభవిస్తున్నందున దోపిడీ వ్యూహాలకు పాల్పడకూడదని సీజేఐ వ్యాఖ్యానించారు.సంపద సృష్టి మానవీయ పద్ధతిలో జరగాలని.ఏ వ్యక్తి , సమాజం, దేశం దోపిడీకి గురికాకుండా , వనరులను బలవంతంగా లాక్కోబడకుండా చూసుకోవాలని జస్టిస్ ఎన్వీ రమణ హితవు పలికారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో న్యాయవ్యవస్థ రాజ్యాంగ హక్కులను శాశ్వతంగా పరిరక్షిస్తుందన్నారు.ప్రభుత్వం చేసే ప్రతి చర్యను న్యాయపరంగా సమీక్షించే అధికారం కోర్టులకు, సుప్రీంకోర్టుకు వుంది.
రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా వున్న ఏ చట్టాన్ని అయినా కొట్టివేయవచ్చని.కార్యనిర్వాహక వ్యవస్థ ఏకపక్షంగా తీసుకునే చర్యలను కూడా పక్కనపెట్టవచ్చని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.
మధ్యవర్తిత్వం ప్రక్రియలో కోర్టుల జోక్యం పెరుగుతోందన్న భయాలు అవసరం లేదని సీజేఐ భరోసా ఇచ్చారు.భారత న్యాయ వ్యవస్థ చట్టబద్ధ పాలనకే ప్రాధాన్యం ఇస్తోందని, పూర్తి స్వతంత్రంగా వ్యహరిస్తోందని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.
కోర్టులకున్న ఇలాంటి లక్షణాల వల్లే భారత్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌కు ప్రాధాన్యం పెరిగిందని ఆయన గుర్తుచేశారు.
అంతకుముందు జర్మనీ పర్యటనలో భాగంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు ప్రఖ్యాత బెర్లిన్గోడ స్మారకాన్ని సందర్శించారు.రెండో ప్రపంచయుద్ధం, తూర్పు-పశ్చిమాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత జర్మనీ విభజనకు ఈ బెర్లిన్ గోడ చిహ్నంగా మిగిలింది.