టాలీవుడ్( Tollywood ) లో టాప్ హీరో ఎవరు అన్న సమాధానానికి ఏ హీరో అభిమానులు వారి హీరో గొప్ప వారే నెంబర్ వన్ అని చెప్పుకుంటూ ఉంటారు.కానీ నెంబర్ హీరో అని ఎవరు కరెక్ట్ గా చెప్పలేరు.
అయితే ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్( Armax ) ఎప్పటికప్పుడు దేశ వ్యాప్తంగా సినీ తారలపై సర్వేలు నిర్వహిస్తూ ఉంటుంది.అలాగే ఇప్పుడు అక్టోబర్ నెలకు సంబంధించి టాలీవుడ్ లో ఎవరు నెంబర్ వన్ అనేది తేల్చింది.
ప్రతినెలా ఏ హీరో ఏ హీరోయిన్ టాప్ 10 స్థానాల్లో ఉన్నారు అన్న విషయాన్ని ఒక లిస్టు రిలీజ్ చేస్తూ ఉంటుంది.మరి అక్టోబర్ నెల కు సంబంధించిన ఆ లిస్టు విషయానికి వస్తే.
అక్టోబర్ నెలకి సంబంధించిన లిస్టును ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది.మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ జాబితా వీళ్లే అంటూ సోషల్ మీడియాలో విడుదల చేసింది.ఈ లిస్టులో ఎప్పటిలాగే ఈసారి కూడా డార్లింగ్ ప్రభాస్( Darling Prabhas ) మొదటి స్థానంలో నిలిచారు.ఆయన చేసిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేక పోయినా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అని చెప్పవచ్చు.
ఆ తర్వాత 2వ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) నిలిచారు.ఆయన్ని అనుసరిస్తూ మూడవ స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు నిలిచారు.
ఆ తర్వాత నాలుగో స్థానంలో రామ్ చరణ్( Ram Charan ) నిలిచారు.ఐదవ స్థానంలో మహేష్ బాబు నిలిచారు.ఇక ఆరవ స్థానంలో పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ఉండగా ఏడవ స్థానంలో హీరో నాని ఉన్నారు.ఎనిమిదవ స్థానంలో విజయ్ దేవరకొండ తొమ్మిదవ స్థానంలో మెగాస్టార్ చిరంజీవి చివరిగా పదవ స్థానంలో మాస్ మహారాజా రవితేజ నిలిచారు.
అలా టాప్ 5లో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబు నిలిచారు.ఇది ఇలా ఉంటే ఈ సర్వే పై స్పందించిన అభిమానులు ఎప్పటికీ టాప్ హీరోగా ప్రభాస్ ఉంటాడు ఆ విషయంలో ఆయనకు ఎవరు సాటి రారంటూ కామెంట్లు చేస్తున్నారు.