సూడాన్ లో అంతర్ యుద్ధం కారణంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో అక్కడి భారతీయులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కావేరీని ప్రారంభించింది.
ఇప్పటికే దాదాపు ఐదు వందల మంది భారతీయులు పోర్ట్ సూడాన్ కు చేరుకున్నారని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.సూడాన్ లో చిక్కుకున్న ఇండియన్స్ కోసం ఆపరేషన్ కావేరీ కొనసాగుతోందన్న ఆయన నౌకలు, విమానాలు వారిని స్వదేశానికి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
సూడాన్ లోని తమ సోదరులు అందరికీ సహాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామని ట్వీట్ చేశారు.