మనం ఏదైనా టీ కొట్టుకు వెళితే ఒక టి కప్పు ధర రూ.5 నుంచి రూ.50 రూపాయల వరకు చెల్లించుట ఉండడం సాధారణమైన విషయం.ఒకవేళ అది ఫాన్సీ కాఫీ అయితే వంద రూపాయల వరకు చెల్లిస్తూ ఉంటాం.కానీ ఒక టీ కొట్టులో మాత్రం ఏకంగా ఒక కప్పు టీ తాగితే రూ.1000 చెల్లించాల్సిందే.వినడానికి ఇది చాలా విచిత్రంగా ఉన్న ఇది నిజం.ఇంతకి ఆ టీ కొట్టు ఎక్కడ ఉందో, అందుకు సంబంధించి పూర్తి వివరాలు చూద్దామా.
పూర్తి వివరాల్లోకి వెళితే… కోల్కతా నగరంలోని ముకుందాపూర్ లో నిర్జష్ అనే అతను ఒక టీ స్టాల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.మొదటిలో ఇతని కొట్టు వద్ద కేవలం రెండు రకాల టీలు మాత్రమే లభిస్తాయి.
వాటిలో మొదటిది బోలే టీ.వాస్తవానికి ఈ టీ పొడి ధర ఏకంగా మూడు లక్షల రూపాయలు.
ఈ అరుదైన టీ పొడితో తయారు చేసిన టీ కొనుకుంటే ఒక వెయ్యి రూపాయలు చెల్లించాల్సిందే.ఇక ఈ టీని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో తయారు చేయడం వల్లనే ఆ టీ కి అంత ధరను నిర్దారించారు.అలాగే ఆ టీ పొడిని తయారు చేసేందుకు అరుదైన తేయాకు ఉపయోగించడం వల్లే ఆ టీ పొడి ధర లక్షలలో ఉంది.ఇక అతని వద్ద సాధారణమైన టీ కూడా లభిస్తుంది.అది కేవలం పన్నెండు రూపాయలు మాత్రమే.రెండు రకాల టీ తో పాటు అతని వద్ద వైట్ టీ, లావెండర్ టీ, హిబిస్కస్ టీ, వైన్ టీ, తులసి అల్లం టీ, బ్లూ టిసేన్ టీ, టీస్టా వాలీ టీ, మకైబరీ టీ, రూబియోస్ టీ, ఓకాయటి టీ ఇలా పలు రకాల టీ లు ఉంటాడు.
ఇతను 2014 ఈ సంవత్సరం నుంచే ఇలా వివిధ రకాల టీ లను అమ్ముతూ శరణ వేగంగా అభివృద్ధి లోకి దూసుకెళ్తున్నాడు.