వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూప్ఖాన్పేటలో క్షుద్రపూజల కలకలం చెలరేగింది.గ్రామ సమీపంలోని వాగులో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసినట్లు ఆనవాళ్లు లభించాయి.
ఈ నేపథ్యంలో నిమ్మకాయలతో పాటు నల్లకోడిని బలి ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు.దాంతో పాటు మట్టితో చేసిన బొమ్మలు లభ్యం అయ్యాయి.
గతంలో ఇదే ప్రాంతంలో క్షుద్రపూజలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు.అయితే ఇటువంటి ఘటనలపై ప్రజలు భయాందోళనకు గురి కావొద్దని పోలీసులు సూచించారు.