యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా తరువాత తారక్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు.
గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ సినిమా తారక్ కెరీర్లో బిగ్గె్స్ట్ హిట్‌గా నిలిచింది.ఇప్పుడు వీరి కాంబినేషనల్లో మరో సినిమా రానుండటంతో ఆ సినిమా టైటిల్ విషయంలో పలు వార్తలు వినిపిస్తున్నాయి.
త్రివిక్రమ్ ఎప్పటిలాగే తన ‘‘అ’’ సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తూ ‘‘అయిననూ పోయి రావలే హస్తినకు’’ అనే టైటిల్‌ను ఈ సినిమాకు ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.కాగా అవి చిత్ర యూనిట్ వరకు వెళ్లడంతో వారు దీనిపై స్పందించారు.
ఆ టైటిల్ తొలుత ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి అనుకున్నట్లు, ఇప్పుడు దాన్ని వాడబోమని వారు తెలిపారు.దీంతో తారక్-త్రివిక్రమ్ సినిమా టైటిల్ మరోసారి డైలమాలో పడింది.
మరి తారక్ కోసం త్రివిక్రమ్ ఎలాంటి టైటిల్‌తో వస్తాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు.కాగా ఇంకా షూటింగ్ కూడా మొదలుకాని సినిమా టైటిల్ కోసం ఏమిటో ఈ గాలి వార్తలు అంటూ అభిమానులు కొట్టిపారేస్తున్నారు.