యూకేలో వర్చువల్ వార్డుల పథకాన్ని ప్రమోట్ చేస్తున్న ఎన్నారై మహిళ.. ఆ విశేషాలు ఇవే..

యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) వర్చువల్ వార్డుల కొత్త పథకాన్ని(virtual wards scheme) తాజాగా లాంచ్ చేసింది.ఇది రోగులకు ఇంట్లోనే ఆసుపత్రి లెవెల్ కేర్‌ను అందిస్తుంది.

 Nri Woman Promoting The Scheme Of Virtual Wards In Ukthese Are The Features Nri-TeluguStop.com

ఈ వర్చువల్ వార్డుల పథకాన్ని యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS)లో పనిచేస్తున్న భారతీయ సంతతికి చెందిన నర్సు నిషా జోస్(Nisha Jose) ప్రమోట్ చేస్తున్నారు.ఆమె మెర్సీ కేర్ క్లినికల్ టెలిహెల్త్ హబ్‌లో క్లినికల్ టీమ్ లీడర్‌గా పనిచేస్తున్నారు.

ఆమె బృందం ఊపిరితిత్తుల వ్యాధి, మధుమేహం, హార్ట్ ఫెయిల్యూర్ వంటి హెల్త్ కండిషన్లలో రోజుకు 2,000 మంది రోగులకు చికిత్సను అందిస్తోంది.

మెర్సీ కేర్ క్లినికల్ టెలిహెల్త్ హబ్‌లోని క్లినికల్( Mersey Care) బృందానికి నాయకత్వం వహిస్తున్న నర్సు నిషా జోస్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం వైద్య సంరక్షణను బాగా మెరుగుపరిచిందని, అనారోగ్యంతో ఉన్నప్పుడు వారి ఇళ్లలో ఉండాలనుకునే రోగులకు చాలా సౌకర్యాన్ని అందించిందని అన్నారు.

ఈ వర్చువల్ వార్డ్ ప్రోగ్రామ్ ఇంగ్లాండ్ అంతటా 340 కంటే ఎక్కువ ప్రోగ్రామ్‌లను కలిగి ఉందని వైద్య నిపుణులకు రిమోట్‌గా పర్యవేక్షించగలిగే మొత్తం 7,653 వర్చువల్ బెడ్‌లను అందిస్తోందని ఆమె వివరించారు.

Telugu Clinical, Medical Care, Mersey Care, Nisha Jose, Nri, Nri Nurse, Teleheal

ఈ వర్చువల్ వార్డులు రోగులకు ఇంట్లోనే కోలుకోవడానికి అనుమతిస్తాయని అన్నారు.ఈ కార్యక్రమం మెర్సీ కేర్ NHS ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా కొనసాగుతోంది.నిషా జోస్ బృందం రక్త పరీక్షలు, మందులు లేదా ఇంట్రావీనస్ డ్రిప్స్‌తో సహా అనేక రకాల పరీక్షలు, చికిత్సలను అందిస్తుంది.

వార్డు రౌండ్‌లో ఇంటి సందర్శన లేదా వీడియో కాంటాక్ట్స్‌ కూడా ఉండవచ్చని ఎన్నారై నర్స్ వెల్లడించారు.క్లినికల్ సిబ్బంది యాప్‌లు, వేరబుల్, ఇతర వైద్య పరికరాలను ఉపయోగించి రోగులు రికవరీ ఎలా సాగుతుందనేది చెక్ చేయవచ్చని ఆమె తెలిపారు.

Telugu Clinical, Medical Care, Mersey Care, Nisha Jose, Nri, Nri Nurse, Teleheal

ఇకపోతే ఆమె ప్రకారం వర్చువల్ వార్డుల పథకం హాస్పిటల్ కేర్ డెలివరీ చేసే విధానానికి గేమ్-ఛేంజర్‌గా ఉంది.ఈ పథకం కింద గత సంవత్సరంలోనే లక్ష కంటే ఎక్కువ మంది రోగులు చికిత్స పొందారు.2023, జనవరిలో 16,000 మంది రోగులు చికిత్స పొందారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube