ఎన్డీఏ కాదు.. ఇండియా కూటమిలోకి టీడీపీ జనసేన ? 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )దూకుడుగా ఉన్నారు.టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు ( Chandrababu arrest )తరువాత టిడిపి రాజకీయంగా కుదేలు కావడంతో ఆ పార్టీ భారాన్ని పవన్ తన భుజాలపై వేసుకున్నారు.

 Not Nda.. Tdp Janasena In India Alliance , Nda, Bjp , Janasena, Pavan Kalyan-TeluguStop.com

రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా తాము గెలుస్తామని , జనసేన టిడిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని,  ప్రస్తుతం ఉన్న పథకాలతో పాటు,  మరికొన్ని సంక్షేమ పథకాలను అందజేస్తామని, క్షేత్రస్థాయిలో టిడిపి , జనసేన కార్యకర్తలు కలిసి రెండు పార్టీలను అధికారంలోకి తీసుకువచ్చేలా కృషి చేయాలని పవన్ చెబుతున్నారు .ఇక టిడిపి కూడా పూర్తిగా పవన్ పైనే భారం వేసినట్టుగా కనిపిస్తోంది.టిడిపి తో పొత్తు కుదిరిన నేపథ్యంలో ఎన్డీఏ నుంచి తాము బయటకు వస్తున్నట్లుగా పవన్ ప్రకటించారు.  త్వరలోనే టిడిపి జనసేనలు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమిలో చేరుతాయనే ప్రచారం జరుగుతోంది.

Telugu Chandrababu, Janasena, Janasenani, Pavan Kalyan-Politics

బిజెపికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలతో ఇండియా కూటమి బలంగా ఉంది .దేశ వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి నడిపిస్తున్న బిజెపి ( BJP )సైతం బలంగానే ఉన్నా , ప్రాంతీయ పార్టీలన్నీ ఇండియా కూటమిలో ఉండడంతో , రాబోయే రోజుల్లో కేంద్రంలో ఇండియా కూటమికి అధికారం దక్కుతుందనే అంచనాలో పవన్ తో పాటు, టిడిపి ఉంది.వాస్తవంగా బిజెపికి దగ్గర అవ్వాలని టిడిపి ( TDP )ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్న,  బిజెపి పెద్దలు ఎవరూ టిడిపిని దగ్గర చేసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు.

Telugu Chandrababu, Janasena, Janasenani, Pavan Kalyan-Politics

 ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో టిడిపి జనసేనలు ఇండియా కోటను చేరే అవకాశం కనిపిస్తోంది ఈ మేరకు వామపక్ష పార్టీల నేతలు పవన్ ( Pawan Kalyan )పై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.ఏపీలో టీడీపీ జనసేన పార్టీలతో కలిసి వెళ్లేందుకు వాము పక్ష పార్టీలు ఆసక్తి చూపిస్తున్నాయి ఎన్డీఏ కోటంలో వామపక్ష పార్టీలు ఉండడం, రాబోయే ఏపీ ఎన్నికల్లో టిడిపి జనసేన వామపక్ష పార్టీలు కలిసి వెళ్తే ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని సర్వే నివేదికలను పరిగణలోకి తీసుకుని ఇండియా కూటమి లో చేరేందుకు టిడిపి , జనసేన పార్టీలు( TDP and Janasena parties ) ఆసక్తి చూపిస్తున్నాడట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube