ఎలాంటి మచ్చ, మొటిమ లేకుండా ముఖ చర్మం అందంగా మెరిసిపోవాలని ఖరీదైన ఫేస్ క్రీమ్స్, సీరమ్స్, ఫేస్ మాస్క్‌లు ఇలా ఎన్నెన్నో ఉత్పత్తులను కొనుగోలు చేసి వాడుతుంటారు.అలాగే తరచూ బ్యూటీ పార్లర్స్‌లో ఫేషియల్స్ చేయించుకుంటారు.
కానీ, ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే కాబూలి సెనగలతో సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.ముఖాన్ని అందంగా, ఆకర్షణీయంగా మెరిపించుకోవచ్చు.
మరి లేటెందుకు కాబూలి సెనగలను చర్మానికి ఎలా వాడాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల కాబూలి సెనగలు, ఒక టేబుల్ స్పూన్ బియ్యం వేసి వాటర్‌తో ఒకటికి రెండు సార్లు కడగాలి.
ఆ తర్వాత అందులో ఒక గ్లాస్ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.ఉదయాన్నే నానబెట్టుకున్న సెనగలు, బియ్యాన్ని వాటర్‌తో సహా బ్లెండర్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని జ్యూస్‌ను స్ట్రైనర్ సాయంతో సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ జ్యూస్‌ను స్టవ్ పై పెట్టి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి.ఇలా ఉడికించుకున్న మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత.
అందులో రెండు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఇ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్రమాన్ని ఏదేనా బ్రష్ సాయంతో ముఖానికి, మెడకు కాస్త మందంగా అప్లై చేసుకోవాలి.

కంప్లీట్‌గా డ్రై అయిన అనంతరం వాటర్‌తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రోజుకు ఒక సారి ఈ విధంగా చేస్తే ముడతలు, మొండి మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.ముఖ చర్మం నిగారింపుగా, యవ్వనంగా మెరుస్తుంది.స్కిన్ టోన్ మెరుగ్గా మారుతుంది.డ్రై స్కిన్ సమస్య దూరం అవుతుంది.ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి, ఈ సింపుల్ రెమెడీని తప్పకుండా ట్రై చేయండి.