Nora Fatehi : నరేంద్ర మోడీకి థాంక్స్ చెప్పిన నోరా ఫతేహి.. కారణం అదే?

బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ నోరా ఫతేహి( Nora Fatehi ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.

 Nora Fatehi : నరేంద్ర మోడీకి థాంక్స్ చ-TeluguStop.com

ఈమె సినిమాలలో హీరోయిన్ గా కంటే ఐటెం సాంగ్స్ ద్వారానే బాగా పాపులారిటీ సంపాదించుకుంది.ఇక తెలుగులో ఎన్టీఆర్ సరసన ఇట్టాగ రెచ్చి పోదాం అంటూ రెచ్చిపోయి చిందులు వేసింది.

ఆ తర్వాత హిందీలో దిల్ బర్ సాంగ్ తో ఒక ఊపు ఊపేసింది.కొద్దిరోజుల పాటు ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిన విషయం తెలిసిందే.

Telugu Bollywood, Earth Quake, Morocco, Narendra Modi, Nora Fatehi, Prime-Movie

ఆ సంగతి పక్కన పెడితే తాజాగా నోరా ఫతేహి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ( PM Narendra Modi )కి కృతజ్ఞతలు తెలిపింది.అసలేం జరిగిందంటే.ఇటీవల మొరాకోలో అర్థరాత్రి భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.ఈ ఘటనతో ఒకసారిగా మొరాకో అంత దద్దరిల్లిపోయింది.ఈ భూకంపం మొరాకో అంతటా విధ్వంసం సృష్టించింది.రాబాట్ కాసాబ్లాంకాతో సహా అనేక మొరాకో నగరాల్లో సంభవించిన భూకంపం కారణంగా ఇప్పటివరకు దాదాపుగా 2000 మందికి పైగా మరణించగా, మరో 1400మందికి పైగా పరిస్థితి విషయంగా ఉంది.

మొరాకో మూలాలు కలిగిన నోరా భూకంపం( Morocco Earth Quake )తో నష్టపోయిన మొరాకో దేశానికి సాయం చేస్తామన్న హామీపై సంతోషం వ్యక్తం చేశారు.

Telugu Bollywood, Earth Quake, Morocco, Narendra Modi, Nora Fatehi, Prime-Movie

మెరాకో( Morocco )లో తీవ్ర భూకంపం సంభవించిన తర్వాత ప్రధాని మోదీ ఓ ట్వీట్ లో.తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం.క్షతగాత్రులు వీలైనంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.

ఈ క్లిష్ట సమయంలో మొరాకోకు అన్ని విధాలా సహాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందంటూ ట్వీట్ చేసారు.అయితే ఆ ట్వీట్ పై స్పందించిన నోరా ఫతేహి మోదీ ట్వీట్ ను ఇంస్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.

ఈ గొప్ప మద్దతుకి ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు! అవగాహన పెంచడానికి సహాయం చేయడానికి ముందుండే దేశాలలో మీరు ఒకరు, మొరాకన్లు చాలా కృతజ్ణులు,ధన్యులు! జై హింద్ అని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube