ఇలా ఉంటుందని ఎవరు చెప్పలేదు... నాకు మరో దారి లేదు.. సమంత పోస్ట్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత గత కొంతకాలంగా మయో సైటిసిస్ వ్యాధితో బాధపడుతూ తాను కమిట్ అయిన సినిమాలకు దూరంగా ఉన్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకున్నటువంటి సమంత ఇప్పుడిప్పుడే తన పనులపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

 No Said It Would Be Like This I Have No Other Choice Samanthas Post Is Viral, Sa-TeluguStop.com

ఈ క్రమంలోనే త్వరలోనే సినిమా షూటింగులతో బిజీ కానున్నటువంటి సమంత భారీగా వర్కౌట్ చేస్తూ తనని తాను మలుచుకుంటున్నారు.ఈ క్రమంలోనే జిమ్ లో కసరత్తులు చేయడం గుర్రపు స్వారీలు చేయడం వంటివి చేస్తూ తనని తాను ఫిట్ చేసుకుంటున్నారు.

Telugu Directer Raj, Kushi, Samantha-Movie

ఇకపోతే ప్రస్తుతం ఈమె రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వస్తున్నటువంటి సిటాడెల్ సిరీస్ లో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ సిరీస్ షూటింగ్లో భాగంగా సమంత ప్రస్తుతం నైనిటాల్‌లో షెడ్యూల్ లో బిజీగా ఉన్నారు.నైనిటాల్‌లో అధిక చలి తీవ్రత ఉన్నప్పటికీ సమంత మాత్రం వాటన్నింటిని ఎదిరించి ఈ షూటింగ్లో పాల్గొన్నారు.ఈ క్రమంలోనే నైనిటాల్‌ షెడ్యూల్ షూటింగ్ గురించి సమంత సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా సమంత ఈ విషయంపై స్పందిస్తూ.ఈ షెడ్యూల్ గానీ, ఈ షూటింగ్ గానీ ఇలా ఉంటుందని ఏ ఒక్కరూ చెప్పలేదు.

Telugu Directer Raj, Kushi, Samantha-Movie

ముఖ్యంగా రాజ్ అండ్ డీకే అయితే చెప్పలేదు…అయినా నాకు ఇప్పుడు వేరే దారి లేదు అంటూ ఈ సందర్భంగా ఈ షూటింగ్ షెడ్యూల్ గురించి సమంత చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.దాదాపు ఆరేడు నెలలుగా సినిమా షూటింగ్లకు దూరంగా ఉన్నటువంటి సమంతా ప్రస్తుతం తిరిగి సినిమా షూటింగులలో పాల్గొనడానికి సిద్ధమవుతుంది.ప్రస్తుతం ఈమె వెబ్ సిరీస్ షూటింగ్లో బిజీగా ఉండగా మరో వారం రోజులలో విజయ్ దేవరకొండ సమంత జంటగా నటిస్తున్నటువంటి ఖుషి సినిమా షూటింగ్ లో బిజీ కానున్నారు.ఇప్పటికే ఈ సినిమా విడుదల కావలసి ఉండగా సమంత ఆరోగ్య పరిస్థితిల కారణంగా ఈ సినిమా షూటింగ్ కూడా వాయిదా పడింది.

త్వరలోనే ఈ సినిమా తిరిగి పట్టాలెక్కనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube