భారత్ నుంచి దావోస్ వెళ్లేందుకు లండన్ దాకా వెళ్లాల్సిన అవసరమే లేదు సీఎం ప్రయాణించే విమానం లండన్‌లో దిగింది. దావోస్ కు వెళ్లాల్సిన సీఎం లండన్‌లో ఎందుకు దిగారు ఎమ్మెల్సీ అనంత బాబు చేసిన ఘటనపై సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలిడ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుపై ఎందుకు కేసు నమోదు చేసి అరెస్టు చేయడం లేదు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వెదిరే శ్రీరామ్ అనేవ్యక్తి అడ్రస్ లేడు పోలవరం నిర్మాణంపై ఎవరో సంబంధంలేని వ్యక్తి నిర్ణయాలు తీసుకుంటున్నాడంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అసమర్థతే పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి, అసెంబ్లీలో మాట్లాడుతూ పోలవరం ఎత్తు తగ్గిస్తారన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరుతెరవలేదు? పోలవరం డ్యామ్ డయాఫ్రమ్ వాల్ కు ఎందుకు ఇలాంటి దుస్థితివచ్చిందో ముఖ్యమంత్రి ప్రజలముందుకు వచ్చి సమాధానం చెప్పాలి?డయాఫ్రమ్ వాల్ వద్ద 800కోట్లతో గుంతలుపూడుస్తాము.2వేలకోట్లతో నీళ్లు తోడతామంటూ ఎన్నాళ్లు కబుర్లు చెబుతావు రాంబాబు సోయిలేని రాంబాబుతో సొల్లుకబుర్లు చెప్పించడం మానుకోండి తప్పుడుపత్రాలతో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు కథనాలువస్తున్నాయి.
నిర్వాసితుల సొమ్మును వైసీపీ వారు పందికొక్కుల్లా తింటుంటే సీఎం జగన్ కి, అంబటి రాంబుబుకి కనిపించడం లేదా పోలవరం నిర్వాసితులసొమ్ముపై కూడా ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి వైసీపీ బెదిరింపులకు భయపడేది లేదు నాయకులు, కార్యకర్తల వెంట ఉంటాం.
ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులపై ఎన్నో కేసులు పెడుతున్నారు వారి తాటాకు చప్పుళ్లకు టీడీపీ భయపడదు అడిగేవారు లేరని ఇష్టమొచ్చినట్లు చేస్తే ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు2024 ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ప్రతి తెలుగువాడిపై ఉంది లేకుంటే రాష్ట్రంలో మరిన్ని అరాచకాలు పెరిగిపోయి ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ ఉండదు