మెగా డాటర్ నిహారిక ( Mega daughter Neharika )పెళ్లైన కొన్నేళ్లకే విడాకులు తీసుకుని అభిమానులకు భారీ షాకిచ్చిన సంగతి తెలిసిందే.విడాకుల తర్వాత తనకు ప్రైవసీ కావాలని నిహారిక సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.
విడాకుల అనంతరం చైతన్య( Chaitanya ) నుంచి నిహారిక భరణం తీసుకున్నారని, నిహారిక త్వరలో కొత్త జీవితాన్ని మరో వ్యక్తితో ప్రారంభిస్తారని వేర్వేరు వార్తలు వినిపిస్తుండగా ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
అయితే విడాకుల తర్వాత నిహారిక సంతోషంగానే ఉన్నారని ఆమె సోషల్ మీడియా పోస్టుల ద్వారా అర్థమవుతోంది.
తాజాగా నిహారిక సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేయగా ఆ పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది.ఆ వీడియోలో ప్రతి అమ్మాయిల గ్యాంగ్ లో నాలుగు రకాల అమ్మాయిలు ఉంటారని ఒక అమ్మాయి ఎప్పుడూ మంచి డ్రెస్ వేసుకోవడానికి ఆసక్తి చూపుతుందని మరొకరు ఏ డ్రెస్ వేసుకున్నా కాన్ఫిడెంట్ గా ఉంటారని అన్నారు.
ఆ గర్ల్స్ గ్యాంగ్ లో( Girls Gang ) మరో అమ్మాయి కనీసం రెడీ కావడానికి కూడా ఆసక్తి చూపరని చివరిగా ఒక మహాతల్లి ఉంటుందని ఆ మహాతల్లి( mahatalli ) ఎప్పుడూ అస్సలు కనబడదని పేర్కొన్నారు.ఈ పోస్ట్ ను చూసిన నెటిజన్లు విడాకుల తర్వాత నిహారిక చాలా సంతోషంగా ఉన్నారని కామెంట్లు చేస్తున్నారు.తన స్నేహితులతో కలిసి నిహారిక సంతోషంగా ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
నిహారిక పోస్ట్ పై కొంతమంది నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తుండగా మరి కొందరు నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు.అయితే నిహారికను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య మాత్రం పెరుగుతోంది.నిహారిక కెరీర్ పరంగా బిజీ కావాలని నటిగా, నిర్మాతగా సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
నిహారిక చేసిన పోస్ట్ కు ఇప్పటివరకు 50,000కు పైగా లైక్స్ వచ్చాయి.