బీఆర్ఎస్ నాయకులను బొక్కలో పెడతాం: కాంగ్రెస్ నేత పొంగులేటి హెచ్చరిక

అధికార మదంతో తప్పుడు కేసులను బనాయించి తమ నాయకులను, కార్యకర్తలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్న బీఆర్ఎస్( BRS ) నాయకులను బొక్కలో పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని రానున్నది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి( Ponguleti Srinivasa Reddy ) పేర్కొన్నారు.కారేపల్లి మండలం భాగ్యనగర్ తండా బీఆర్ఎస్ కు చెందిన సుమారు 500 కుటుంబాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.

 Brs Leaders Will Be Put To Death Congress Leader Ponguleti Warns , Brs, Pongule-TeluguStop.com

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి పొంగులేటి మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తప్పుడు కేసులన్నింటిని మాఫీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.డబుల్ బెడ్ రూమ్, పోడు భూములు, లక్ష రూపాయాల రుణమాఫీ మొదలగు మయమాటలు చెప్పి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఈసారి కూడా రావాలని చూస్తున్నాడని కానీ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ కు అధికారం కట్టబెట్టే ఆలోచనలో లేదని పేర్కొన్నారు.

తెలంగాణ యావత్తు కాంగ్రెస్ వైపే చూస్తుందని పేర్కొన్నారు.సొల్లు మాటలు చెప్పే కేసీఆర్( KCR ) ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని అధికారం ఉందని విర్ర విగుతున్న ప్రతి ఒక్కరికి బుద్ధి చెబుతామన్నారు.14లక్షల ఎకరాలకు పట్టాలు పొందేందుకు బీద పోడు రైతులు అర్హులుగా ఉంటే కేవలం నాలుగు లక్షల ఎకరాలు అదికూడా పింక్ కలర్ చొక్కా తొడుక్కున్న వారికి మాత్రమే కేసీఆర్ పట్టాలు కట్టబెట్టాడని విమర్శించారు.రాబోవు కురుక్షేత్ర యుద్ధంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఖచ్చితంగా ప్రతి బీద పోడు రైతుకు పట్టాలు ఇస్తామని, అర్హులైన ప్రతిఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి ఇస్తామని తెలిపారు.

కేసీఆర్ దీక్ష వల్ల సోనియమ్మ తెలంగాణ ఇవ్వలేదని, 60 ఏళ్లుగా యోధనయోధులు చేసిన పోరాటాన్ని, 1400 మంది అమరుల బలిదానాలను చూసి చలించిపోయి తెలంగాణను ఇచ్చిందన్నారు.ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చి సోనియమ్మకు గిఫ్ట్ ఇస్తామని ఇందుకు తెలంగాణ ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి చేరిన ప్రతి ఒక్కరికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో విజయభాయి, రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, పార్టీ మండల అధ్యక్షుడు తలారి చంద్ర ప్రకాశ్, ఇమ్మడి తిరుపతి రావు, మల్లెల నాగేశ్వరరావు, గుగులోతు శ్రీను, ఎస్.కె.సైదులు, సర్పంచ్ లు అజ్మీరా నరేష్, అదెర్ల స్రవంతి, ఆలోతు ఈశ్వరి నందరాజ్, హీరాలాల్, ధోని, ఎమ్లా నాయక్, కాపా సుధాకర్, షేర్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube