India-Israel Maitri Project : ఇజ్రాయెల్‌లో భారతీయ ఇన్‌ఫ్లూయెన్సర్ల పర్యటన

ప్రభుత్వేతర సంస్థ షరాకా ఈ వారం భారతదేశం నుంచి మేధావులు, ఇన్‌ఫ్లూయెన్సర్లు, నిపుణులు, విద్యావేత్తలతో కూడిన మొదటి ప్రతినిధి బృందాన్ని ‘‘ ఇండియా – ఇజ్రాయెల్ మైత్రీ ప్రాజెక్ట్ ( India – Israel Friendship Project )’’ (ఐఐఎంపీ) కింద ఇజ్రాయెల్‌కు తీసుకొచ్చింది.దీని కింద హోలోకాస్ట్ ఎడ్యుకేషన్, ఇజ్రాయెల్ (Holocaust Education, Israel)సమాజానికి పలు అంశాలపై అవగాహన కల్పించనున్నారు.

 India-israel Maitri Project : ఇజ్రాయెల్‌లో భారత�-TeluguStop.com

ఈ భారత ప్రతినిధి బృందానికి ఆతిథ్యం ఇవ్వడం మాకు గౌరవంగా ఉందని షరాకా ఛైర్మన్ అమిత్ డెరి అన్నారు.ఈ పర్యటనలో వీరు పొందే జ్ఞానం, అనుభవాలు రాబోయే సంవత్సరాల్లో ఇరు దేశాల భవిష్యత్తుకు పునాదులు వేస్తాయని అమిత్ డెరి అభిప్రాయపడ్డారు.

రిపబ్లిక్ డేను పురస్కరించుకుని ఆయనలో భారత్‌లో పర్యటించారు.

Telugu Christians, Hindus, Holocaust, India, Indiaisrael, Israel, Muslims, Ngo S

భారతదేశం నుంచి హిందూ , ముస్లిం, క్రైస్తవులతో (Hindus, Muslims, Christians ,India)కూడిన సీనియర్ ప్రతినిధి బృందానికి ఇజ్రాయెల్ ఆతిథ్యం ఇస్తుండటంపై మేం ఎంతో సంతోషిస్తున్నామని షరాకా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాన్ ఫెర్మాన్ అన్నారు.భారతీయులతో ఇజ్రాయెల్‌‌కి అసాధారణ సంబంధం ఉన్నప్పటికీ.మన సమాజాలు ఒకదానికొకటి పరిచయం లేవన్నారు.

జనవరి 31న ముగిసిన ఆరు రోజుల పర్యటనలో భాగంగా భారతీయ ప్రతినిధి బృందం జెరూసలేంలోని చారిత్రాత్మక , పవిత్ర స్థలాలను సందర్శించింది.అలాగే ఇజ్రాయెల్‌కు చెందిన నిపుణులు, విభిన్న సమాజాల లీడర్లను కలుసుకుంది.

Telugu Christians, Hindus, Holocaust, India, Indiaisrael, Israel, Muslims, Ngo S

ప్రస్తుత ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం తాలూకా భౌగోళిక రాజకీయ చిత్రాన్ని అర్ధం చేసుకోవడానికి గాను అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు నిర్వహించిన దాడి ప్రభావిత ప్రాంతాలను కూడా ప్రతినిధి బృందం సందర్శించింది.నాటి దాడిలో హమాస్ ఉగ్రవాదులు దాదాపు 1200 మందిని ఊచకోత కోయడంతో పాటు 251 మందిని తమ వెంట బందీలుగా తీసుకెళ్లారు.గాజా యుద్ధం కారణంగా దక్షిణాసియాలోని అనేక దేశాలలో ఇజ్రాయెల్ వ్యతిరేక భావాలు స్పష్టంగా కనిపిస్తున్న సమయంలో భారత ప్రతినిధి బృందం ఇజ్రాయెల్‌లో పర్యటిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube