నెక్స్ట్ టార్గెట్.. ఆ ఐదు రాష్ట్రాలే ?

దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసిన కర్నాటక రాజకీయాలకు సంబంధించిన చర్చలే ఎక్కువగా జరుగుతున్నాయి.ఎందుకంటే ఆ రాష్ట్రంలో జాతీయ పార్టీలు అయిన బీజేపీ కాంగ్రెస్ పోటాపోటిగా తలపడడం, గెలుస్తుందని భావించిన బీజేపీకి షాక్ ఇచ్చి కాంగ్రెస్ విజయబావుట ఎగురవేయడం.

 Next Target Those Five States, Congress , Bjp, Karnataka Election , Telangana,-TeluguStop.com

అలా ఆద్యంతం ట్విస్ట్ లతో సాగాయి కర్నాటక రాజకీయాలు.ఇదిలా ఉంచితే బీజేపీ కాంగ్రెస్ మద్య జరిగే రాజకీయ వైరం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.జాతీయ పార్టీలుగా చక్రం తిప్పుతున్నా ఈ రెండు పార్టీలు అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రాలలోనూ గట్టిగా పోటీ పడుతుంటాయి.2014 కు ముందు కాంగ్రెస్ హవా కొనసాగితే ఆ తరువాత నుంచి బీజేపీ హవా నడుస్తోంది.

Telugu Chhattisgarh, Congress, Karnataka, Madhya Pradesh, Rahul Gandhi, Telangan

2014 మరియు 2018 ఎన్నికల్లో విజయం సాధించి గత తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ వచ్చే 2024 ఎన్నికల్లో విజయం సాధించి మూడో సారి కూడా అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతోంది.అయితే ఈసారి వచ్చే ఎన్నికల్లో బీజేపీకి షాక్ ఇచ్చి అధికారం చేపట్టాలని కాంగ్రెస్( Congress ) చూస్తోంది.అందువల్ల ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన ఈ రెండు పార్టీలకు అత్యంత కిలకంగా మారాయి.కర్నాటక ఎన్నికల( karnataka election ) గెలుపుతో ఊపు మీద ఉన్న కాంగ్రెస్ రాబోయే ఎన్నికలపై దృష్టి పెట్టింది.

ఈ ఏడాది చివర్లో మరో ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి.తెలంగాణ, ఛత్తీస్ గడ్, మద్యప్రదేశ్, మిజోరాం, రాజస్తాన్.ఈ ఐదు రాష్ట్రాలలో కూడా విజయం సాధించి రెట్టింపు ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికల్లో విజయఢంఖా మోగించాలని హస్తం పార్టీ భావిస్తోంది.

Telugu Chhattisgarh, Congress, Karnataka, Madhya Pradesh, Rahul Gandhi, Telangan

అయితే తెలంగాణ, మిజోరాం, ఛత్తీస్ గడ్ వంటి రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల ప్రభావం కూడా గట్టిగానే ఉంది.అయినప్పటికి పోటీ తట్టుకొని గెలుపు దిశగా పయనిస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తిరుగుండదనేది కాంగ్రెస్ వ్యూహం.మరోవైపు బీజేపీ కేవలం మోడి మేనియా పైనే పూర్తి భారం మోపింది.

రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్లమెంట్ ఎన్నికలకు సిద్దమవ్వడంలోనూ మోడీ బ్రాండ్ తోనే విజయం సాధించాలని చూస్తోంది బీజేపీ.అయితే మోడీ మంత్రం కర్నాటక ఎన్నికల్లో ఏమాత్రం పని చేయకపోవడం బీజేపీని కలవరపరిచే అంశం.

మరి రోజుల్లో ఆయా రాష్ట్రాలలో జరిగే ఎన్నికలకు బీజేపీ ఎలాంటి వ్యూహాలను అమలు చేయబోతుందనేది ఆసక్తికరం.మొత్తానికి అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నెక్స్ట్ ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలపైనే ఫోకస్ పెట్టాయి.

మరి ఆ రాష్ట్రాలు ఈ రెండు పార్టీల భవిష్యత్ ను ఎటు తెలుస్తాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube