మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.కోఠి సీబీఐ కార్యాలయానికి సునీతా రెడ్డి భర్త రాజశేఖర్ రెడ్డి వెళ్లారని తెలుస్తోంది.
వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి విచారణ తరువాత సీబీఐ అధికారులతో రాజశేఖర్ రెడ్డి భేటీ అయ్యారని సమాచారం.వివేకా రెండవ భార్య షమీమ్ సీబీఐకి ఇచ్చిన స్టేట్ మెంట్ వెలుగులోకి వచ్చిన క్రమంలో రాజశేఖర్ రెడ్డి సీబీఐ కార్యాలయంలో కనిపించడం చర్చనీయాంశంగా మారింది.
అయితే షమీమ్ రాజశేఖర్ రెడ్డితో పాటు అతని సోదరుడు బెదిరింపులకు పాల్పడ్డారంటూ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.