బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2 అతి త్వరలోనే పూర్తి కాబోతుంది.ఈ సారి ఆరంభం నుండి కూడా విమర్శలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.
ఆ విమర్శలను ఎదుర్కొంటూనే బిగ్‌బాస్‌ను ముందుకు తీసుకు వెళ్తున్నారు.సెలబ్రెటీల విషయంలో ఆరంభంలోనే పెదవి విరిచిన ప్రేక్షకులు ఆ తర్వాత ఒక్కొ ఇంటి సభ్యుడిపై ఒక్కో విధంగా స్పందస్తూ వస్తున్నారు.
మొదట బిగ్‌బాస్‌కు గీతా మాధురి చాలా చాలా ప్లస్ అవుతుందని, ఆమె తప్పకుండా ఫైనల్ వరకు ఉంటుందని అంతా అనుకున్నారు.అంతా అనుకున్నట్లుగా ఫైనల్ వరకు ఆమె ఉండే అవకాశం కనిపిస్తుంది.
కాని ఆమెపై ప్రేక్షకుల్లో విమర్శలు తారా స్థాయిలో వస్తున్నాయి.

తొలి నుండి గేమ్‌ను ఎంతో కాన్ఫిడెన్స్‌తో ఆడుతున్న గీతా మాధురి.తన భర్త నందు వచ్చి బయట పరిస్థితి వివరించాక తనను మించిన కంటెస్టెంట్ లేరు అన్నట్టుగానే వ్యవహరిస్తోంది.సామ్రాట్ విషయంలో ప్రేక్షకులు తనను తప్పుగా అర్ధం చేసుకున్నారని రాఖీ కట్టి చేతులు దులుపేసుకున్న గీతా మాధురి కొత్తగా ‘సోఫా’ ప్రేమకథల్ని తెరపైకి తెచ్చింది.
ఒక అమ్మాయి అబ్బాయి కళ్లల్లో కళ్లు పెట్టుకుని… చేతిలో చేయి వేసుకుని అదే పనిగా చూస్తూ ఉంటుంటే.బ్యాగ్రౌండ్లో ‘కళ్లు కళ్లు ప్లస్సూ… వాళ్లు వీళ్లు మైనస్ ఒళ్లు ఒళ్లు ఇన్టు చేసేటి ఈక్వేషన్’ అంటూ రొమాంటిక్ సాంగ్ ప్లే అవుతుంటే.
ఆ సీన్ చూసిన ప్రేక్షకులు వీళ్లది అన్నా చెల్లెల్ల రిలేషన్ అని మాత్రమే అనుకోవాలంటే అది గీతకు చెల్లుతుందేమో కాని చూసే ప్రేక్షకులకు తేడాగానే కన్వే అవుతుంది.సామ్రాట్‌తో కొంటె చూపులు, కవ్వింపులు, లిప్ స్టిక్ చర్చలు, హగ్ ప్రాక్టీస్‌లు చేసిన గీతా మాధురి.
తప్పంతా నాదేం కాదు.చూసిన ప్రేక్షకులదే.
చూపించిన బిగ్ బాస్‌దే అంటూ అంటే.మీకైనా అర్ధమౌతోందా ? గీతా గారూ ఏం మాట్లాడుతున్నారో.
watch video: from 1:42:00
అంతే కాదు కౌశల్ కి బిగ్ బాస్ కి వస్తునట్టు ముందే తెలుసు.అందుకే ఆర్మీ సృష్టించాడు అని కామెంట్ చేసింది.కానీ నిజానికి గతంలో ఒక ఇంటర్వ్యూలోనే గీత తాను బిగ్ బాస్ కి వెళ్లనున్నట్టు చెప్పింది.ఇప్పుడు ఆ ప్రూఫ్ తో మరోసారి గీతామాధురిని ట్రోల్ చేస్తున్నారు నెటిజెన్స్.! ఈ కింద వీడియో
.