పవిత్ర అవ్వకు నరేష్ తాతకు పెళ్లి.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!

గత కొన్నిరోజులుగా సీనియర్ నరేష్ పవిత్ర లోకేశ్ లకు సంబంధించిన వివాదం కన్నడ మీడియా వర్గాలతో పాటు తెలుగు రాష్ట్రాలలో కూడా చర్చనీయాంశం అయిందనే సంగతి తెలిసిందే.అటు పవిత్ర లోకేశ్ ఇటు నరేష్ ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో పెళ్లి చేసుకుంటామని కన్ఫామ్ చేశారు.

 Netizens Trolling Senior Naresh And Pavitra Lokesh Details Here Goes Viral,senior Actor Naresh,pavitra Lokesh,ramya Raghupathi,suchendra Prasad-TeluguStop.com

వీళ్లిద్దరి పెళ్లి గురించి జోరుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.కొంతమంది నెటిజన్లు మాత్రం అటు నరేష్ ను ఇటు పవిత్రను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

పవిత్ర అవ్వకు నరేష్ తాతకు పెళ్లి అంటూ కొంతమంది నెటిజన్లు వెటకారంగా చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.మరి కొందరు నరేష్ నాలుగో పెళ్లి చేసుకోవడంపై అసభ్యంగా కామెంట్లు చేస్తున్నారు.

 Netizens Trolling Senior Naresh And Pavitra Lokesh Details Here Goes Viral,senior Actor Naresh,pavitra Lokesh,ramya Raghupathi,suchendra Prasad-పవిత్ర అవ్వకు నరేష్ తాతకు పెళ్లి.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వికీపీడియాలో పవిత్ర లోకేశ్ భర్త సుచేంద్ర ప్రసాద్ అని వివరాలు అందుబాటులో ఉండగా పవిత్ర లోకేశ్ మాత్రం తాను ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదని సుచేంద్ర ప్రసాద్ తో తనకు పెళ్లి జరగలేదని చెప్పారు.

2017 సంవత్సరం నుంచి పవిత్ర లోకేశ్ సుచేంద్ర ప్రసాద్ నుంచి విడిగా ఉంటున్నారని సమాచారం అందుతోంది.సినిమాల ద్వారానే పవిత్ర లోకేశ్, నరేష్ లకు పరిచయం ఏర్పడిందని తెలుస్తోంది.మరోవైపు నరేష్ రమ్య రఘుపతి ఎనిమిదేళ్లుగా విడిగా ఉంటున్నారని సమాచారం అందుతోంది.

అయితే నరేష్ విడాకుల నోటీస్ ను మాత్రం నెలరోజుల క్రితమే పంపారని తెలుస్తోంది.

నరేష్ కు విడాకులు ఇవ్వడానికి రమ్య రఘుపతికి మాత్రం ఇష్టం లేదు.

ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.నరేష్ పవిత్ర లోకేశ్ ఈ తరహా వివాదాల ద్వారా వార్తల్లో నిలవడం అభిమానులకు అస్సలు నచ్చలేదు.

నరేష్ పవిత్రల పెళ్లి జరిగినా వీళ్లిద్దరూ ట్రోలింగ్ ను ఎదుర్కోక తప్పదు.ఈ ట్రోల్స్ విషయంలో నరేష్ పవిత్ర లోకేశ్ ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube