లైగర్ పోస్టర్ పై టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఎలా రియాక్ట్ అయ్యారో తెలిస్తే షాకవ్వాల్సిందే..!

విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో లైగర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.తాజాగా ఈ సినిమా నుంచి పోస్టర్ రిలీజ్ కాగా ఈ పోస్టర్ పై ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 Tollywood Star Heroines Reaction About Vijay Devarakonda Bold Look,liger,liger P-TeluguStop.com

మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ ను ఎడిట్ చేసి మరి కొందరు పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు.అయితే విజయ్ దేవరకొండ లైగర్ పోస్టర్ పై నెటిజన్లు స్పందించి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ సినిమాలో నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ బోల్డ్ రోల్ గురించి సమంత స్పందిస్తూ అతనికి రూల్స్ తెలుసని ఆ రూల్స్ ను బ్రేక్ చేయడం కూడా తెలుసని గట్స్ అండ్ గ్లోరీ అంటూ కామెంట్లు చేశారు.

విజయ్ రూపంలో మనకు స్పెషల్ డెలివరీ రాబోతుందని జాన్వీ కపూర్ అన్నారు.లైగర్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని గుడ్ లక్ అంటూ పూజా హెగ్డే తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

Telugu Liger, Liger Poster, Netizens, Pooja Hegde, Rashmika, Samantha-Movie

రష్మిక స్పందిస్తూ ఇప్పటివరకు నీ స్పూర్తి ఎవరని అడిగితే తాను ఎవరి పేరు చెప్పలేదని ఇకపై విజయ్ దేవరకొండ పేరు చెబుతానని ఆమె చెప్పుకొచ్చారు.నీకు మా ప్రేమ మద్దతు ఉందని ఈ దేశానికి నీవేంటో చూపించాలని ఆమె కామెంట్లు చేశారు.మరి కొందరు హీరోయిన్లు కూడా లైగర్ మూవీ గురించి స్పందించాల్సి ఉంది.పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది.
ఆగష్టు 25వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.కరణ్ జోహార్ ఈ సినిమాను హిందీలో విడుదల చేస్తున్నారు.

లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండకు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు దక్కే అవకాశాలు అయితే ఉన్నాయి.ఈ సినిమాకు విజయ్ భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube