లైగర్ పోస్టర్ పై టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఎలా రియాక్ట్ అయ్యారో తెలిస్తే షాకవ్వాల్సిందే..!
TeluguStop.com
విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో లైగర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ సినిమా నుంచి పోస్టర్ రిలీజ్ కాగా ఈ పోస్టర్ పై ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ ను ఎడిట్ చేసి మరి కొందరు పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు.
అయితే విజయ్ దేవరకొండ లైగర్ పోస్టర్ పై నెటిజన్లు స్పందించి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ సినిమాలో నటిస్తున్నారు.విజయ్ దేవరకొండ బోల్డ్ రోల్ గురించి సమంత స్పందిస్తూ అతనికి రూల్స్ తెలుసని ఆ రూల్స్ ను బ్రేక్ చేయడం కూడా తెలుసని గట్స్ అండ్ గ్లోరీ అంటూ కామెంట్లు చేశారు.
విజయ్ రూపంలో మనకు స్పెషల్ డెలివరీ రాబోతుందని జాన్వీ కపూర్ అన్నారు.లైగర్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని గుడ్ లక్ అంటూ పూజా హెగ్డే తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
"""/"/
రష్మిక స్పందిస్తూ ఇప్పటివరకు నీ స్పూర్తి ఎవరని అడిగితే తాను ఎవరి పేరు చెప్పలేదని ఇకపై విజయ్ దేవరకొండ పేరు చెబుతానని ఆమె చెప్పుకొచ్చారు.
నీకు మా ప్రేమ మద్దతు ఉందని ఈ దేశానికి నీవేంటో చూపించాలని ఆమె కామెంట్లు చేశారు.
మరి కొందరు హీరోయిన్లు కూడా లైగర్ మూవీ గురించి స్పందించాల్సి ఉంది.పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది.
ఆగష్టు 25వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
కరణ్ జోహార్ ఈ సినిమాను హిందీలో విడుదల చేస్తున్నారు.లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండకు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు దక్కే అవకాశాలు అయితే ఉన్నాయి.
ఈ సినిమాకు విజయ్ భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.
సీరియల్స్ సంపాదన చీరలకే సరిపోతుంది.. ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు వైరల్!