బిగ్ బాస్ 3 సీజన్ లో పాల్గొన్న తర్వాత అషు రెడ్డి క్రేజ్ బాగా పాపులర్ అయ్యింది.సోషల్ మీడియాలో అషు రెడ్డి ఎంత దూసుకుపోతుందో అందరికీ తెలిసిందే.
ఇక ఎప్పటికప్పుడు తన ఫోటోలను, వీడియోలను తీసి నెట్టింట్లో తెగ షేర్ చేస్తుంది.మొత్తానికి అషు రెడ్డి ఓ సెలబ్రిటీ గా పేరు సంపాదించుకుంది.
అషు రెడ్డి సోషల్ మీడియాలో అడుగు పెట్టిన తర్వాతే బుల్లితెరపై పరిచయం అయింది.ఆమె మొదట్లో సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోలతో బాగా ఫేమస్ అయింది.
చూడటానికి సమంత లా ఉన్న అషు రెడ్డి కు బాగా ఫాలోయింగ్ పెరిగింది.తక్కువ సమయంలో తన కెరీర్ మొత్తం మారిపోయింది.ఇక సినిమాల్లో నటించాలని ఆసక్తి కూడా కలుగగా చల్ మోహన్ రంగా సినిమా లో ఒక పాత్రలో నటించింది.
ఇక ఆమెకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టమని పలుమార్లు చెప్పుకొచ్చింది.
అతనిపై ఉన్న ఇష్టం, అభిమానం తనకు పీకల మీద ఉండటంతోపాటు ప్రైవేట్ పార్టులో ఆయన పేరుతో ఉన్న టాటూలను వేసుకోవడమే కాకుండా చూపించింది కూడా.ఇక అషు రెడ్డి బిగ్ బాస్ తర్వాత బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.
పైగా ఆ సమయంలో రాహుల్ సిప్లిగంజ్ తో ఈమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.అతనితో పగలు, రాత్రులు అని తేడా లేకుండా బాగా తిరిగేసింది.ఆ తర్వాత కొంతకాలానికి ఈమె బుల్లితెరపై పలు షో లల్లో కమెడియన్ గా, యాంకర్ గా చేసింది.ఇక ఆ సమయంలో కూడా మరింత క్రేజ్ సంపాదించుకుంది.
ఇక ఈమె మరో కమెడియన్ ఎక్స్ప్రెస్ హరి తో కూడా తెగ రొమాన్స్ లు చేసింది.షోలో భాగంగా అతనితో మితిమీరి ప్రవర్తించింది.
ఆ తర్వాత ఈమెకు నాన్ స్టాప్ బిగ్ బాస్ లో అవకాశం రావడంతో అందులో కూడా కొన్ని రోజుల వరకు ఉండి బాగా హంగామా చేసింది.అనంతరం మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారింది.
నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేసుకుంటూనే ఉంటుంది.గ్లామర్ లుక్ లతోనే కాకుండా ట్రెడిషనల్ లుక్ లో కూడా దర్శనమిస్తూ ఉంటుంది.పైగా ఆమెకు బాగా నెగిటివ్ కామెంట్లు కూడా వస్తూ ఉంటాయి.అయిన వాటి గురించి అస్సలు పట్టించుకోదు ఈ బ్యూటీ.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తను చీర కట్టుకొని ఉన్న ఫోటోను షేర్ చేసుకుంది.
ఇక ఆ చీర కట్టులో తను ఎంతో అందంగా ఉండగా ఆ ఫోటోకు లైక్స్ తో పాటు కామెంట్లు కూడా వస్తున్నాయి.
ఇక ఒక నెటిజెన్ అది ₹1000 చీర అంటూ కామెంట్ చేయగా.మరో నెటిజన్ బొట్టు పెట్టుకోమని సలహా ఇచ్చారు.ప్రస్తుతం అషు రెడ్డి ఫోటోలు బాగా వైరల్ అవుతూ ఉన్నాయి.