బాయ్ ఫ్రెండ్ ఫోటో అడిగిన నెటిజన్.. షాకింగ్ రిప్లై ఇచ్చిన వెంకీ మామ కూతురు?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ బాగా నడుస్తుంది.ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బాగా పంచుకుంటున్నారు యూజర్ లు.

 Netizen Asked Boyfriend Photo Venky Daughter Gave A Shocking Reply Venkatesh, Da-TeluguStop.com

ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు.

అంతేకాకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుని మరింత క్రేజ్ సంపాదించుకుంటున్నారు.ఇక సమయం దొరికినప్పుడల్లా ఫాలోవర్స్ తో బాగా ముచ్చట్లు పెడుతూ ఉంటారు.

ఇక ఫాలోవర్స్ కూడా దొరికిందే ఛాన్స్ అన్నట్లు తమలో ఉన్న డౌట్ లన్ని సెలబ్రెటీలను అడుగుతూ ఉంటారు.ఇప్పటికీ ఎంతోమంది నెటిజన్లు సెలబ్రెటీలను వ్యక్తిగత విషయాలు అడుగుతూ సమాధానాలు రప్పించుకున్నారు.

ఇక తాజాగా మరో సెలబ్రిటీని కూడా తన బాయ్ ఫ్రెండ్ ఫోటో అడుగుతూ బాగా రచ్చ చేశారు.ఇంతకు ఆమె ఎవరో కాదు.

వెంకీ మామ కూతురు.

అదేంటి వెంకీ మామ కూతురిని బాయ్ ఫ్రెండ్ ఫోటో అడగటం ఏంటి అనుకుంటున్నారా.

నిజానికి మనం మాట్లాడుకోవాల్సింది వెంకీ మామ రియల్ కూతురు కాదు.వెంకటేష్ సినిమాలో నటించిన వెంకటేష్ కూతురు.

గతంలో వెంకటేష్ నటించిన దృశ్యం సినిమా గురించి అందరికీ తెలిసిందే.ఇక అందులో వెంకటేష్ చిన్న కూతురుగా నటించిన బ్యూటీ నే ఎస్తర్ అనిల్.

అంతేకాకుండా కమల్ హాసన్, గౌతమి కలిసి నటించిన పాపనాశం సినిమాలో కూడా కమల్ కు చిన్న కూతురుగా నటించింది.ఇటీవలే దృశ్యం 2 లో కూడా నటించి తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Telugu Boyfriend, Drushyam, Johar, Tollywood, Venkatesh-Movie

ఇక బాలనటిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఎస్తర్ ప్రస్తుతం హీరోయిన్ గా అవ్వడానికి తెగ తాపత్రయ పడుతుంది.ఇప్పటికే టాలీవుడ్ లో జోహార్ అనే సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఇక మరిన్ని అవకాశాల కోసం ఈ అమ్మడు బాగా పోరాటపడుతుంది.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ ఫోటోలను అభిమానులతో బాగా పంచుకుంటుంది.నిత్యం ఫోటో షూట్ అంటూ బాగా బిజీగా ఉంటుంది.

Telugu Boyfriend, Drushyam, Johar, Tollywood, Venkatesh-Movie

ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.అతి తక్కువ సమయంలో ఈమె హీరోయిన్ గా అయ్యి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇంట్లో కంటే నెట్టింట్లో ఎక్కువ సమయాన్ని గడుపుతుంది ఈ బ్యూటీ.

ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతుంది.ఇక తాజాగా మరోసారి తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టింది.

అందులో నెటిజన్లు తనను అడగాల్సిన ప్రశ్నలు అడిగి సమాధానం తెలుసుకున్నారు.ఇక ఓ నెటిజన్ తన బాయ్ ఫ్రెండ్ ఫోటో అడగటంతో షాకింగ్ రిప్లై ఇచ్చింది ఈ బ్యూటీ.

ఇంతకు తనిచ్చిన రిప్లై ఏంటంటే.వెంటనే తన కుక్కపిల్లతో దిగిన ఫోటోలు పంచుకుంటూ అదే తన బాయ్ ఫ్రెండ్ అంటూ.

ఇక తన లుక్స్ చాలా చిరాకుగా ఉన్నాయి అని కామెంట్ పెట్టింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube