పేకాటలో మునిగితేలుతున్న దీప్తి సునైనా.. వైరల్ అవుతున్న స్టోరీ!

బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరై ఎంతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న దీప్తి సునయన గురించి అందరికీ తెలిసిందే.

హౌస్ లో ఉన్నంత కాలం తన అల్లరితో, ఎమోషనల్ తో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.

దీప్తి బిగ్ బాస్ షో కంటే ముందు డబ్ స్మాష్ వీడియోలతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.ఆ తర్వాత యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ తో బాగా మెప్పించింది.

అలా అక్కడినుంచి బిగ్ బాస్ లో అవకాశం అందుకోగా తన కెరీర్ మొత్తం బిగ్ బాస్ తో మొదలైందని చెప్పవచ్చు.ఇక బిగ్ బాస్ తర్వాత పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.

మంచి సక్సెస్ లు అందుకుంది.మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంది.

Advertisement

అంతేకాకుండా సింగర్ గా తన పాటతో బాగా మెప్పించింది.ఇక దీప్తి సునయనకు మరో సోషల్ మీడియా స్టార్ షణ్ముఖ్ తో ఉన్న సంబంధం గురించి అందరికీ తెలిసిందే.

వీరిద్దరూ కలిసి గతంలో కొన్ని కవర్ సాంగ్స్ కూడా చేశారు.అలా వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ షిప్ ఏర్పడింది.

కొంతకాలం వరకు వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ లా ఉన్నట్లు అందరినీ నమ్మించారు.

కానీ కొంతకాలం తర్వాత వీరిద్దరి మధ్య లవ్ నడుస్తుందని అనుమానాలు వచ్చాయి.అంతేకాకుండా టాటులు కూడా ఒకేలా వేయించుకోవటంతో బాగా అనుమానాలు రావడంతో బిగ్ బాస్ సీజన్ 5 తో నిజమైంది.కానీ అందులో షణ్ముఖ్ నెగిటివిటిని మూటగట్టుకున్నాడు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

ఆల్రెడీ దీప్తి సునయన తో లవ్ లో ఉన్నాడు.

Advertisement

కానీ షన్ను మరో కంటెస్టెంట్ సిరితో మితిమీరి హద్దులతో ప్రవర్తించడంతో బాగా విమర్శలు ఎదుర్కొన్నాడు.అంతేకాకుండా షో నుండి బయటికి వచ్చాక దీప్తి సునయనను దూరంగా ఉంచటంతో.ఇక షన్ను తో తన రిలేషన్ కరెక్ట్ కాదని బ్రేకప్ చెప్పుకుంది.

ఈ విషయాన్ని తనే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

ఇక ఆరోజు నుంచి దీప్తి బాగా ఎమోషనల్ గా ఉంటుంది.సోషల్ మీడియా వేదికగానే తాను రిఫ్రెష్ అవుతుంది.కొన్ని కొన్ని కొటేషన్స్ తో అందరి దృష్టిని తాకుతుంది.

అప్పుడప్పుడు లవ్ ను ఉద్దేశించి కొన్ని కొన్ని కొటేషన్స్ కూడా పెడుతుంది.ఇక చాలా వరకు తను కూడా సోషల్ మీడియా వేదికగా రిఫ్రెష్ అవుతూ కొత్త లైఫ్ ని ప్రారంభించింది.

ఒకవైపు ఫోటో షూట్లతో బాగా బిజీగా ఉంటూ.మరోవైపు షార్ట్ ఫిలిమ్స్ తో బాగా సందడి చేస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టాలో ఒక స్టోరీ పంచుకోగా అందులో తను పేకాట ఆడుతున్నట్లుగా కనిపించింది.దీంతో ప్రస్తుతం ఆ స్టోరీ వైరల్ గా మారడంతో.

ఆ స్టోరీని చూసిన నెటిజన్లు.దీప్తి పేకాటలో బాగా మునిగి తేలుతుంది కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

తాజా వార్తలు