అమెరికా : ఇల్లినాయిస్ డెమొక్రాటిక్ ప్రైమరీలో రాజా కృష్ణమూర్తి ఘన విజయం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికా గడ్డ మీదకు అడుగుపెట్టిన భారతీయులు పలు రంగాల్లో విజయవంతంగా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే.డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, సీఈవోలు, రాజకీయ నాయకులుగా కీలక హోదాల్లో వున్నారు.

 Indian-origin Us Congress Man Raja Krishnamoorthi Wins Democratic Primary From I-TeluguStop.com

ఇకపోతే.ఇండో అమెరికన్ కమ్యూనిటీలో ప్రముఖ వ్యక్తిగా వున్న భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి మరోసారి రేసులో నిలిచిన సంగతి తెలిసిందే.

దీనిలో భాగంగా ఇల్లినాయిస్ రాష్ట్రం నుండి డెమొక్రాటిక్ ప్రైమరీలో ఆయన ఘన విజయం సాధించారు.తన సమీప ప్రత్యర్థి జునైద్ అహ్మద్‌ను దాదాపు 71 శాతం ఓట్లతో ఓడించారు.

ఇల్లినాయిస్‌లోని ఎనిమిదో కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌లో జునైద్ అహ్మద్‌ నిర్వహించిన మతపరమైన ప్రచారం కూడా కృష్ణమూర్తి విజయాన్ని అడ్డుకోలేదు.తన విక్టరీపై రాజా కృష్ణమూర్తి మాట్లాడుతూ.ఇల్లినాయిస్‌లోని ఎనిమిదో కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌లోని డెమొక్రాటిక్ ప్రైమరీ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు.మధ్యతరగతి ప్రజల కోసం, మహిళల పునరుత్పత్తి హక్కుల కోసం, ద్రవ్యోల్బణంపై కాంగ్రెస్ లో కీలక పోరు ఉంటుందని కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం తమ దృష్టి అంతా వచ్చే నవంబర్ 8న జరిగే సాధారణ ఎన్నికలపై ఉందని ఆయన అన్నారు.ఈ ఎన్నికల్లో రాజా కృష్ణమూర్తి .రిపబ్లికన్ అభ్యర్థి క్రిస్ డార్గిస్‌తో తలపడనున్నారు.

Telugu Chris Dargis, Illinois, Indian Origin, Junaid Ahmad, Congress-Telugu NRI

2017 నుంచి ఇల్లినాయిస్ 8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ కు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు రాజా కృష్ణమూర్తి.న్యూఢిల్లీలో తమిళ కుటుంబంలో ఆయన జన్మించారు.కృష్ణమూర్తికి మూడు నెలల వయసున్నప్పుడే అతని కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది.

ఇల్లినాయిస్‌లోని పెయెరియాలో హైస్కూల్ విద్యను, పెయెరియా రిచ్‌వుడ్స్ హైస్కూల్ నుంచి వాలెడిక్టోరియన్‌గా కృష్ణమూర్తి పట్టభద్రులయ్యారు.ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ, హార్వర్డ్ లా స్కూల్‌లోనూ ఆయన ఉన్నత విద్యను అభ్యసించారు.

ఇటీవల రాజా కృష్ణమూర్తికి ప్రతిష్టాత్మక పురస్కారం దక్కిన సంగతి తెలిసిందే.తన అత్యుత్తమ కెరీర్, ప్రజాసేవలో అంకిత భావానికి గుర్తింపుగా విశిష్ట లీడర్‌షిప్ అవార్డుతో ఆయనను సత్కరించారు.

ఈ క్రమంలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో ఇల్లినాయిస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ .జెస్సీ వైట్ ఈ అవార్డును రాజా కృష్ణమూర్తికి అందజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube