Naveen Chandra: కలర్స్ స్వాతి తో నవీన్ చంద్ర పెళ్లి.. ఫైనల్ గా అసలు విషయం బయటపెట్టిన హీరో..!!

నవీన్ చంద్ర( Naveen Chandra ) కలర్స్ స్వాతి జంటగా రాబోతున్న తాజా మూవీ మంత్ ఆఫ్ మధు.ఈ సినిమా ఈరోజు అంటే సెప్టెంబర్ 26న విడుదల కాబోతుంది.

 Naveen Chandras Wedding With Colors Swathi The Hero Who Revealed The Truth Fina-TeluguStop.com

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నవీన్ చంద్రకి ఒక షాకింగ్ ప్రశ్న ఎదురైంది.అదేంటంటే నిజంగానే కలర్స్ స్వాతి( Colours Swathi ) నువ్వు పెళ్లి చేసుకున్నారా అని.అయితే ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ.అప్పట్లో నేను కలర్స్ స్వాతి సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నామని వార్తలు గట్టిగానే వినిపించాయి.

అంతేకాదు మాకు సంబంధించిన పెళ్లి ఫోటోలు కూడా నెట్టింట చక్కర్లు కొట్టడంతో ఇద్దరం నిజంగానే పెళ్లి చేసుకున్నాం అని అందరూ భావించారు.

అయితే ఈ విషయాన్ని నేను కానీ స్వాతి కానీ అంత సీరియస్ గా తీసుకోలేదు.దాంతో దానిపై క్లారిటీ ఇవ్వాలనిపించలేదు.ఇక మేము క్లారిటీ ఇవ్వకపోయే సరికి చాలామంది జనాలు మేమిద్దరం నిజంగానే పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఎలాంటి స్పందన ఇవ్వడం లేదు అంటూ రాసుకోచ్చారు.

కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే మేమిద్దరం కలిసి నటించిన త్రిపుర సినిమా పోస్టర్ ( Tripura Movie Poster ) రిలీజ్ అయింది.

ఇక ఆ పోస్టర్లో ఏదైతే మేమిద్దరం సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాం అంటూ ఫోటోలు చక్కర్లు కొట్టాయో అవే ఫోటో పోస్టర్లో ఉండడంతో దీన్ని చూసిన అందరూ త్రిపుర సినిమా షూటింగ్లో భాగంగా అలా చేశారని క్లారిటీకి వచ్చారు.దాంతో అందరూ సైలెంట్ అయిపోయారు.ఇక మా మధ్యన అలాంటిదేమీ లేదు .మంత్ అఫ్ మధు ( Month Of Madhu ) సినిమా అందర్నీ ఆకర్షిస్తుందని ఆశిస్తున్నాం అంటూ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నవీన్ చంద్ర తన పెళ్లి గురించి అలాగే సినిమా గురించి చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube