ఆనంద్ మహీంద్రాకు నటరాజన్ స్పెషల్ గిఫ్ట్... అదేంటంటే?

ఆనంద్ మహీంద్రా కార్పొరేట్ సంబంధిత వ్యవహారాలు ఫాలో అయ్యే వారికి పరిచయం అక్కర లేని పేరు.ఒక వ్యాపారవేత్తగానే కాకుండా ఒక మానవతావాదిగా సోషల్ మీడియాలో మంచి మంచి సంఘటనలను తన వ్యక్తిగత సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.

 Natarajan Special Gift To Anand Mahindra, Natarajan , Anand Mahindra, Social Med-TeluguStop.com

ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వ్యాపారవేత్తగాఆనంద్ మహీంద్రా ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక అసలు విషయానికొస్తే ఆస్ట్రేలియా పర్యటనలో తమ అద్భుతమైన ప్రదర్శనతో సత్తా చాటిన భారత క్రీడాకారులకు తమ సంస్థకు చెందిన ఎస్యూవీ థార్ వాహనాలను బహుమతిగా ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే ఇక ఆ వాహనాన్ని అందుకున్న నటరాజన్ ఆనంద్ మహీంద్రా కు కృతజ్ఞతలు తెలిపాడు.భారత్ తరపున ఆడే అవకాశం రావడం నా అదృష్టం.

మీ లాంటి గొప్పవారి ప్రశంసలు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపాడు.అయితే ఆనంద్ మహీంద్రాకు నట రాజన్ రిటర్న్ గిఫ్ట్ పంపించాడు.

తన అరంగేట్ర గబ్బా మ్యాచ్ లో ధరించిన జెర్సీపై తన సంతకం చేసిన జెర్సీని ఆనంద్ మహీంద్రాకు నటరాజన్ పంపించాడు.ఇక నటరాజన్ అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.

యువ క్రికెటర్లపై మీరు చూపిన అభిమానం వెలకట్టలేనిదని అభిమానులు ఆనంద్ మహేంద్రాను అభినందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube