ఆనంద్ మహీంద్రాకు నటరాజన్ స్పెషల్ గిఫ్ట్... అదేంటంటే?

ఆనంద్ మహీంద్రా కార్పొరేట్ సంబంధిత వ్యవహారాలు ఫాలో అయ్యే వారికి పరిచయం అక్కర లేని పేరు.

ఒక వ్యాపారవేత్తగానే కాకుండా ఒక మానవతావాదిగా సోషల్ మీడియాలో మంచి మంచి సంఘటనలను తన వ్యక్తిగత సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.

ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వ్యాపారవేత్తగాఆనంద్ మహీంద్రా ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక అసలు విషయానికొస్తే ఆస్ట్రేలియా పర్యటనలో తమ అద్భుతమైన ప్రదర్శనతో సత్తా చాటిన భారత క్రీడాకారులకు తమ సంస్థకు చెందిన ఎస్యూవీ థార్ వాహనాలను బహుమతిగా ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే ఇక ఆ వాహనాన్ని అందుకున్న నటరాజన్ ఆనంద్ మహీంద్రా కు కృతజ్ఞతలు తెలిపాడు.

భారత్ తరపున ఆడే అవకాశం రావడం నా అదృష్టం.మీ లాంటి గొప్పవారి ప్రశంసలు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపాడు.

అయితే ఆనంద్ మహీంద్రాకు నట రాజన్ రిటర్న్ గిఫ్ట్ పంపించాడు.తన అరంగేట్ర గబ్బా మ్యాచ్ లో ధరించిన జెర్సీపై తన సంతకం చేసిన జెర్సీని ఆనంద్ మహీంద్రాకు నటరాజన్ పంపించాడు.

ఇక నటరాజన్ అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.యువ క్రికెటర్లపై మీరు చూపిన అభిమానం వెలకట్టలేనిదని అభిమానులు ఆనంద్ మహేంద్రాను అభినందిస్తున్నారు.

స్టార్ హీరోయిన్ అనుష్క ఆ వ్యాధితో బాధ పడుతున్నారా.. వైరల్ వార్తల్లో నిజమెంత?