టీడీపీ అంటే ఒక కుటుంబం కార్యకర్తలు మా బిడ్డలు..నారా భువనేశ్వరి

టీడీపీ( TDP ) జెండా రెపరెపలాడటం కోసం కార్యకర్తలు లాఠీ దెబ్బలు తింటున్నారు నిరసనల్లో మహిళల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తే రాష్ట్రంలో ఎలాంటి నాయకత్వం ఉందో అర్థమవుతోంది చంద్రబాబు స్ట్రాంగ్ పర్సన్.ఆయన్ను మానసిక క్షోభకు గురిచేయలేరు.

 Nara Bhuvaneshwari Commemts On Chandrababu Naidu Arrest , Nara Bhuvaneshwari-TeluguStop.com

రాజమహేంద్రవరం:- టీడీపీ అంటే ఒక కుటుంబమని, కార్యకర్తలు మా బిడ్డల్లాంటి వారని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి( Nara Bhuvaneshwari ) అన్నారు.టీడీపీ జెండా రెపరెపలాడటం కోసం కార్యకర్తలు లాఠీ దెబ్బలు తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు అరెస్ట్ పై నిరసనల్లో పాల్గొన్న మహిళల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తే రాష్ట్రంలో ఎలాంటి నాయకత్వం ఉందో అర్థమవుతోందని అన్నారు.చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న శాంతియుత నిరసనలను సైతం అనుమతించకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న అణచివేత ధోరణిని భువనేశ్వరి తీవ్రంగా తప్పుబట్టారు.

కార్యకర్తలు మా బిడ్డలతో సమానం.ఆ బిడ్డలు తల్లిదండ్రుల కోసం నేడు హింసకు గురవుతున్నారని, అక్రమ కేసులకు గురై జైలుకు వెళ్తున్నారని బాధను వ్యక్తం చేశారు.

పార్టీ జెండా రెపరెపలాడాలని వారి జీవితాలనే ఫణంగా పెట్టారని, మహిళలు అన్న సంగతి కూడా మర్చిపోయి పోలీసులు ఇష్టానుసారంగా లాగిపడేస్తున్నారని అన్నారు.రాష్ట్రంలో నేటి లీడర్ షిప్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ ఘటనలే నిదర్శనమన్నారు.

టీడీపీ కార్యకర్తలైన మా బిడ్డలు పార్టీకి వెన్నెముకలాంటి వాళ్లని, వాళ్లే లేకుంటే పార్టీ లేదని పేర్కొన్నారు.పోలీసులు ఏం చేసినా తమ బిడ్డలు బెదరరని, టీడీపీ కుటుంబానికి పెద్ద అయిన చంద్రబాబు కోసం బిడ్డల్లాంటి కార్యకర్తలు నిరాహార దీక్ష చేస్తుంటే లాఠీలతో కొట్టడం బాధాకరమన్నారు.

వేటికీ బెదరకుండా పోరాటం చేస్తున్న, అండగా నిలుస్తున్న కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు.

చిల్లర పనులతో చంద్రబాబు( Chandrababu naidu )ను మానసిక క్షోభకు గురిచేయలేరుతప్పుడు కేసులతో చంద్రబాబును జైల్లో పెట్టిన ప్రభుత్వం ఆయన భోజనం చేసేందుకు కనీసం టేబుల్ కూడా సమకూర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడుకు భోజనం చేసేందుకు చిన్నపాటి సౌకర్యం కల్పించలేదన్నారు.అడ్వకేట్ లెటర్ పెట్టిన తర్వాత మాత్రమే ఆయనకు టేబుల్ ఏర్పాటు చేశారని అన్నారు.

చంద్రబాబును మానసిక క్షోభకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.ఇలాంటి చిల్లర ఆలోచనలతో చంద్రబాబును ఎవరూ మానసిక క్షోభకు గురిచేయలేరని భువనేశ్వరి అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో ఉన్నారన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube