నాగపూర్ టు అమరావతి నేషనల్ హైవే అలైన్మెంట్ మార్చాలి...ఖమ్మం కార్పొరేషన్ విస్తరణ కు ఆటంకం గా హైవే

నాగపూర్ టు అమరావతి గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే అలైన్మెంట్ మార్చాలని ఖమ్మం జిల్లాలోని నేషనల్ హైవే సమీక్షలో పాల్గొన్న కేంద్ర మంత్రివర్యులు బిఎల్ వర్మ కి భూ నిర్వాసిత జేఏసీ ప్రతినిధి బృందం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రైతు జేఏసీ ప్రతినిధులు గ్రామాలకు, పట్టణ, నగరాలకు సంబంధం లేకుండా గ్రీన్ ఫీల్డ్ జాతీయరహదారులు నిర్మాణం చేస్తామని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించిందని, కానీ నాగపూర్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ జాతీయరహదారి ఎలైన్ మెంట్ మాత్రం గ్రామాలు, ఖమ్మం నగరం ను చీల్చే విధంగా తయారు చేశారని అన్నారు.

నూతన కలెక్టర్ కార్యాలయం ను నగరం భయటవైపు కు గ్రీన్ ఫీల్డ్ జాతీయరహదారి ఉంచుతుందన్నీ తెలిపారు.ఖమ్మం పట్టణం రాబోయే పది సంవత్సరాల్లో ఎటుచూసినా పది కిలోమీటర్ల మేర విస్తరించే అవకాశం ఉన్నదున్న, ఈ నేషనల్ హైవే ఖమ్మం పట్టణానికి అతి సమీపంలో వెళుతుండటం వల్ల, పట్టణ విస్తీర్ణానికి ఆటంకం గా మారే ప్రమాదం ఉందన్నారు.

అదే విధముగా ఖమ్మం నగర సమీపంలో వందలాది పేదలు, మధ్యతరగతి ప్రజల, రిటైర్డ్ ఉద్యోగస్తుల ఇండ్ల స్థలాలు ఈ నాగపూర్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ జాతీయరహదారి క్రింద నష్టపోయే అవకాశం ఉందని మంత్రికి తెలియజేశారు.ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు పరిశీలించాలని కోరారు.

అనంతరం జిల్లా కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ మధుసూదన్ లతో చర్చలు జరిపారు.సానుకూలంగా స్పందించిన అధికారులు సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు.

Advertisement

ఈ ప్రతినిధి బృందంలో రైతు జేఏసీ నాయకులు తక్కెళ్ళపాటి భద్రయ్య, వేములపల్లి సుధీర్, కామంచికల్ మాజీ సర్పంచ్, రైతు జేఏసీ నాయకులు తొండల సత్యనారాయణ, సిపిఐ(యం) జిల్లా కమిటీ సభ్యులు ఎస్.నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కార్మికులను బెల్టుతో ఇష్టానుసారం కొట్టిన చైనా వ్యక్తి.. వైరల్ వీడియో...?
Advertisement

తాజా వార్తలు