ది ఘోస్ట్ విషయంలో నాగార్జున రిస్క్ అన్ని రూ.కోట్లా.. చెప్పినా వినకుండా?

నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ది ఘోస్ట్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి.ఏఎంబీ సినిమాస్ మినహా మిగతా థియేటర్లలో బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోయినా పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ది ఘోస్ట్ రేంజ్ మారే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

 Nagarjuna Risk In The Ghost Movie Details, Nagarjuna, Nagarjuna Risk, Nagarjuna-TeluguStop.com

ఈ సినిమాను నాగ్ హిందీలో కూడా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారని తెలిసిందే.అయితే ఈ సినిమా విషయంలో నాగార్జున రిస్క్ 4 కోట్ల రూపాయలు అని బోగట్టా.

హిందీలో ఈ సినిమాను విడుదల చేయడానికి నాగార్జున ఈ మొత్తం ఖర్చు చేస్తున్నారని సినిమా సక్సెస్ సాధిస్తే బయ్యర్ నుంచి ఈ మొత్తం నాగార్జునకు తిరిగి దక్కనుంది.నాగార్జున ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా రిలీజ్ చేస్తూ ఆ మొత్తాన్ని రెమ్యునరేషన్ గా తీసుకుంటూ ఉండగా 6 కోట్ల రూపాయలకు అటూఇటుగా నాగార్జునకు రెమ్యునరేషన్ దక్కనుందని తెలుస్తోంది.

తన రెమ్యునరేషన్ లో 4 కోట్ల రూపాయలు నాగ్ రిస్క్ చేస్తున్నారంటే గ్రేట్ అనే చెప్పాలి.

హిందీలో ఊహించని స్థాయిలో నాగార్జునకు క్రేజ్ ఉండగా ది ఘోస్ట్ సినిమాతో ఆ క్రేజ్ మరింత పెరుగుతుందని నాగ్ భావిస్తున్నారు.

ది ఘోస్ట్ రిజల్ట్ ఒక విధంగా నాగార్జున కెరీర్ ను డిసైడ్ చేయనుంది.ఈ సినిమా సక్సెస్ సాధిస్తే ఈ తరహా ప్రయోగాలకు నాగార్జున ఓకే చెప్పే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.ది ఘోస్ట్ రిజల్ట్ విషయంలో ప్రవీణ్ సత్తారు పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

నాగార్జున ది ఘోస్ట్ ప్రమోషన్స్ లో ఉత్సాహంగా పాల్గొంటూ ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సిస్టర్ సెంటిమెంట్ కథతో ఈ సినిమా తెరకెక్కుతుండగా సోలో హీరోగా సరైన బ్లాక్ బస్టర్ లేని నాగార్జునకు ఈ సినిమా కచ్చితంగా కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube