జనసేన నాయకుడు, నటుడు నాగబాబు తన విమర్శలకు పదును పెట్టారు.తాజాగా ఆయన రోజాపై చేసిన విమర్శలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి.
ఎన్నికలు దగ్గరపడుతుండంతో అధికార పార్టీ నేతలపై ఎదురుదాడికి దిగుతున్నారు.పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను తీవ్ర స్థాయిలో తిప్పికొడుతున్నారు.
పవన్‌కు ప్యాకెజ్ తీసుకోవాల్సి కర్మ ఏంటని.టాప్ హీరోగా ఉన్న తను.సినిమాలకు కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్‌గా తీసుకుంటున్నాడని అలాంటప్పుడు ఇతరులు ఇచ్చే దానిపై ఆశపడుతడా? అని విమర్శిస్తున్నారు.వచ్చేది ఎంతైనా అందులోనే పవన్ సంతోషం వెతుక్కుంటాడని కానీ వైసీపీ నేతలు లక్షల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని కానీ వారికి అందులో సంతోష లేకుండా పొయిందని విమర్శించారు.

వైసీపీ వాళ్లతో పోలిస్తే మాకు చాలా తక్కువే కానీ వచ్చిన దాన్ని ఎంతో కొంత సమాజం కోసం ఉపయోగిస్తాం.కానీ వైసీపీ నాయకులు ఉన్నదంతా తమకే కావలనే అత్యాశలో ఉన్నారన్నారు .వైసీపీ నేతల ఆలోచనల్లో పరిపక్వత లేదని విమర్శించారు.

నాగబాబులో ఈ మధ్య ఆవేశం ఎక్కువగా కనిపిస్తుంది.ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్లుగా వైసీపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని నిర్ణయుంచుకున్నట్లు తెలుస్తుంది.తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగిచడానికి కూడా వెనుకాడనని సన్నిహితులతో నాగబాబు చెప్పినట్లుగా సమాచారం.
ఉన్నట్టుండి నాగబాబు ఇలా మాట్లాడానికి మరో కారణం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.అయితే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్న నేపథ్యంలో తను సీరియస్ పోలిటిషన్ అని ప్రజలు గుర్తించేందుకే నాగబాబు ఇలా మాట్లాడుతున్నారని విశ్లేషకులు అంటున్నారు.
అలాగే జనసేన నుండి పవన్ తప్ప పెద్ద వాయిస్ వినిపించే నాయకుడు లేకపోవడంతో ఆ పార్టీపై ప్రజల్లో నమ్మకం లేకుండా పోయిందని అందుకే తను సెంకడ్ వాయిస్‌గా మారాలని అనుకుంటున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారని వివరిస్తున్నారు.