అక్కినేని నాగచైతన్య, అగ్రకథానాయిక సమంతలు పెళ్లి అయిన తర్వాత కలిసి తెరను పంచుకోబోతున్నారు.గతంలో హిట్ పెయిర్‌గా గుర్తింపును సొంతం చేసుకున్న చై, సామ్‌లు పెళ్లి తర్వాత ‘మజిలి’ చిత్రంలో నటించనున్నారు.
భార్యాభర్తల బంధం గురించి ఈ చిత్రం తెరకెక్కనుంది.క్యూట్ కపుల్ చై.సామ్ కలిసి నటించనున్న ఈ చిత్రం కోసం అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ చిత్రం కోసం నాగచైతన్య, సమంతలు భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.క్రేజీ పెయిర్ పెళ్లయ్యాక కలిసి నటిస్తున్న మొదటి చిత్రం కావడంతో నిర్మాతలు వీరి డిమాండ్‌ను బట్టి అడిగినంత ఇవ్వడానికి ఓకే చెప్పేశారట.విడివిడిగా ఎంత తీసుకుంటున్నారు అనే అంశాన్ని పట్టించుకోకుండా ఇద్దరికి కలిపి ఆరుకోట్ల ఆరవై లక్షల పారితోషికాన్ని ఇవ్వడానికి నిర్మాత ఒకే చెప్పినట్టు టాక్.
భారీ పారితోషికం గురించి అధికారిక సమాచారం అయితే రాదు కానీ అనధికార వర్గాల నుండి ఈ పెయిర్ భారీ రేంజ్‌లో డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.

చై, సామ్‌లకు ఉన్న క్రేజ్ వల్ల ఆ మాత్రం డిమాండ్ చేయడంలో పెద్ద విశేషమేమి కాదు అని విశ్లేషకులు భావిస్తున్నారు.ఎందకంటే ఈ హిట్ పెయిర్ కలిసి నటిస్తున్న చిత్రం భారీగానే సేల్ అవుతుంది, అంతేకాకుండా టాక్‌తో సంబంధం లేకుండా నాగచైతన్య.సమంతల కోసం వెళ్లి చూసే వారు కూడా ఉంటారు.
మొత్తానికి ఈ ఇద్దరి కాంభోకు భారీ గిరాకీ పెరిగింది.ముందు ముందు ఇద్దరు కలిసి నటించాలంటే ఈ గిరాకీ మరింతగా పెరిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.