‘ఎన్టీఆర్‌’ కోసం విద్యాబాలన్‌ రెమ్యూనరేషన్‌ ఎంత తీసుకుందో తెలిస్తే వామ్మో అంటారు!

టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌ అంటే ప్రస్తుతం గుర్తుకు వచ్చేది నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రం.ఈ చిత్రంలో భారీ తారాగాణం తళుక్కున మెరువనున్నారు.

 Vidya Balan Remuneration For Ntr Biopic Film-TeluguStop.com

ఇక ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్‌ నటీమణి విద్యాబాలన్‌ నటిస్తోంది.మొదటగా బసవతారకం పాత్ర కోసం చాలామందిని సంప్రదించారు.

చివరగా చిత్ర యూనిట్‌ విద్యాబాలన్‌ కోసం ముంబై వెళ్లి ఆమెకు కథ వినిపించి ఓకే చేశారు.బసవతారకం పాత్రకు విద్యాబాలన్‌ చాలా బాగా సరిపోయింది.

విద్యాబాలన్‌ బాగా సెట్‌ అవుతుందనే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్‌ కాస్త ఖర్చు అయినా కూడా ఈ అమ్మడినే ఎంపిక చేసుకున్నారు.దాదాపు 15రోజుల డేట్లను విద్యాబాలన్‌ ‘ఎన్టీఆర్‌’ కోసం కేటాయించింది.ఈ అమ్మడు రోజుకు 5 లక్షల చొప్పున పారితోషికం పుచ్చుకుంటుంది.అయితే ఇది కేవలం తన డేట్లు ఇచ్చినందుకు.ఇవే కాకుండా విద్యాబాలన్‌ హోటల్‌, తిండి, మేకప్‌, కార్‌వాన్‌, పర్సనల్‌ అసిస్టెంట్‌లు ఇలా చాలా ఖర్చు అయింది.ఇదంతా కలుపుకుంటే భారీగా విద్యాబాలన్‌ కోసం ఖర్చు చేశారు చిత్ర యూనిట్‌.

‘ఎన్టీఆర్‌’ చిత్రంలో బాలక్రిష్ణ పాత్ర తర్వాత అధికంగా కనిపించేది విద్యాబాలన్‌ పాత్రేనట.మిగతా తారాగాణం అంతా కూడా ఒక్కరోజో, రెండు రోజుల్లో ఈ చిత్రం కోసం కేటాయించారు.విద్యాబాలన్‌ మాత్రం అధికంగా తన కాల్షీట్లను కేటాయించింది.అందుకు తగ్గట్టే భారీ రేంజ్‌లో పారితోషికాన్ని అందుకుంది.ఏది ఏమైనా ఈ అమ్మడి రెమ్యూనరేషన్‌ చూసి అంతా షాకవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube