‘బాహుబలి’ చిత్రంతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన హీరో ప్రభాస్ తాజాగా కాఫీ విత్ కరణ్ షోకు హాజరయ్యాడు.ఈ షోలో భాగంగా కరణ్ ప్రభాస్‌ను అనేక ప్రశ్నలు అడగగా వాటన్నిటికి నవ్వుతూ సమాధానం చెప్పాడు.
అనుష్క, ప్రభాస్‌లు ప్రేమించుకుంటున్నారు, గతకొంత కాలంగా సహజీవనం చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి కదా వాటిపై మీ స్పందన ఏంటి అని అడగగా, చాలాకాలం కలిసి నటించాం కదా అందుకే అలాంటి పుకార్లు వచ్చాయి అని చెప్పుకొచ్చాడు.

బాలీవుడ్‌లో ఫేవరేట్ స్టార్ ఎవరు అని అడగగా దీపిక పదుకునే పేరు చెప్పాడు.ఇకపోతే బెస్ట్ ఫెర్ఫార్మర్ అని అడగగా ఆలియా భట్ అని అన్నాడు.సౌత్‌లో సెక్సియెస్ట్ హీరోయిన్ ఎవరు అంటే అందులో ఇచ్చిన ఆప్షన్‌లను బట్టి అనుష్క అని చెప్పేశాడు.
అంతేకాకుండా ఈ షోలో ప్రభాస్ చెప్పేవన్నీ అబద్దాలేనా? అని ప్రశ్నించగా యస్ అని సమాధానం చెప్పాడు.దాంతో ఈ చిత్రంలో ప్రభాస్ చెప్పినవన్నీ కూడా అబద్దాలే అనే క్లారిటీ అయితే వచ్చింది.

అనుష్క, ప్రభాస్‌ల రిలేషన్ గురించి ఇద్దరు కూడా ఎప్పుడు క్లారిటీ ఇవ్వడం లేదు.ప్రతిసారి ఇద్దరు డిప్లమాటిక్ సమాధానాలు చెబుతూ అలాగే సస్పెన్స్‌లో ఉంచుతున్నారు.ప్రభాస్ ప్రస్తుతం ‘సాహో’ చిత్రంలో నటిస్తున్నాడు.భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రం కోసం యంగ్ రెబల్ స్టార్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.







