మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ తో ఎంపీ విజయసాయి రెడ్డి భేటీ అయ్యారు.ఈ మేరకు హైదరాబాద్ లోని బాలినేని నివాసంలో సుమారు రెండు గంటల పాటు ఇరువురు చర్చలు జరిపారని సమాచారం.
వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ పదవికి బాలినేని రాజీనామా చేసిన అనంతరం తాడేపల్లికి పిలిపించుకుని సీఎం జగన్ రెండు సార్లు మాట్లాడిన విషయం తెలిసిందే.అయితే సీఎం జగన్ చెప్పినా బాలినేని వెనక్కి తగ్గలేదని తెలుస్తోంది.
కాగా ఉమ్మడి ప్రకాశం జిల్లా ఇంఛార్జ్ గా బాధ్యతలు తీసుకోవాలని బాలినేని యోచనలో ఉండగా కొందరు జిల్లా నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని సమాచారం.మరోవైపు బాలినేని స్థానంలో రీజనల్ కోఆర్డినేటర్ గా విజయసాయి రెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించనున్నట్లు సమాచారం ఉంది.
దీంతో ఇద్దరి భేటీ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.